సినిమా నటి ఇంట్లో భారీ దొంగతనం.. లక్షల కొద్దీ డబ్బుతో...

సినిమా నటి ఇంట్లో భారీ దొంగతనం.. లక్షల కొద్దీ డబ్బుతో...
బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముగ్గురు అనుమానితులు అకస్మాత్తుగా..

పట్టపగలు ముగ్గురు దుర్మార్గులు చండీగఢ్ సెక్టార్ 27 లోని మోడల్‌గా మారిన నటి అలంకృత సహాయ్‌ ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో బెదిరించి రూ. 6 లక్షలు దోచుకున్నారు. అనుమానితులలో ఒకరిని బాధితురాలు గుర్తించారు. నెల రోజుల క్రితమే ఆమె నగరానికి మారినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తన తల్లిదండ్రులలతో కలిసి నివసిస్తున్నారు. ఇంటి రెండవ అంతస్తును అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు గత 10 రోజులుగా ఆమెతో లేని విషయాన్ని దుండగులు పసిగట్టారు. అదే అదనుగా భావించి చోరీకి పాల్పడ్డారు.

బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ముగ్గురు అనుమానితులు అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించారు. అలంకృత పనిమనిషి వస్తుందని తలుపు తెరిచి ఉంచింది. నిందితుల్లో ఒకరు కత్తిని తీసుకుని ఆమెను బెదిరించారు. బాధితురాలిపై కూడా అనుమానితులు దాడి చేశారని పోలీసులు ఆరోపించారు.

వారు ఆమె ATM కార్డును తీసుకొని దాని PIN నెంబర్ అడిగారు. తరువాత ఒక అనుమానితుడు సమీపంలోని ATM సెంటర్‌కు వెళ్లి ఆమె ఖాతా నుండి రూ .20,000 డ్రా చేసాడు. తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో బాధితురాలు అనుమానితుడిని నెట్టి గదిలో బంధించింది. అనుమానితులు బాల్కనీలోకి వెళ్లి కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాష్‌రూమ్ డోర్‌ కూడా లాక్ చేసింది.

అనుమానితులు ఆమె నుండి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వాష్‌రూమ్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. ప్రాణభయంతో బాధితురాలు రూ .6 లక్షలు గదిలోనుంచి బయటకు విసిరేసింది. ఆ డబ్బు తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు అలంక‌‌ృత. ఈ మేరకు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.

బాధితురాలు అనుమానితులలో ఒకరిని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. "నేరానికి పాల్పడిన అనుమానితులలో ఒకరు బాధితురాలి ఇంటికి ఇటీవల ఆమె కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ని డెలివరీ చేసేందుకు వెళ్లారు" అని పోలీసులు వివరించారు.

సినిమా నటి ఇంట్లో భారీ దొంగతనం.. లక్షల కొద్దీ డబ్బుతో...బాధితురాలు ఆగస్టు 3 న మన్మోహన్ నుండి ఫర్నిచర్ ఆర్డర్ చేసింది. ఆగస్ట్ 30 న రామా ఇండస్ట్రీస్ నుండి నలుగురు వ్యక్తులు ఫర్నిచర్ డెలివరీ చేయడానికి ఆమె ఇంటికి వచ్చారు. ఆమె ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించి చోరీకి పాల్పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story