సినిమా

Meera Mithun: షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ జంప్..

Meera Mithun: అప్పటికే ఆమెతో మొదలు పెట్టిన చిత్రం 80 శాతం పూర్తయింది.

Meera Mithun: షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ జంప్..
X

Meera Mithun: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ నటి మీరా మిథున్.. మొన్నటికి మొన్న కులపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది.. తాజాగా మరోసారి ఓ సినిమా షూటింగ్ పూర్తవుతున్న సమయంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా పారి పోయింది. గతంలో చేసిన వ్యాఖ్యలకుగాను మిరాను పోలీసులు అరెస్టు చేశారు.

అప్పటికే ఆమెతో మొదలు పెట్టిన చిత్రం 80 శాతం పూర్తయింది. మిగిలిన 20 శాతం షూటింగ్‌ను కొడైకెనాల్‌లో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందనగా మీరా మిథున్ తనతో వచ్చిన ఆరుగురు వ్యక్తులతో కలిసి పారిపోయిందని దర్శకుడు సెల్వ అన్భరసన్ తలపట్టుకుంటున్నారు.

మీరా కథానాయికగా నటించిన చిత్రం పేయ కానోమ్. గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తేని భారత్ ఆర్.సురుళివేల్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మీరాతో పాటు నటుడు కౌశిక్, సంధ్య రామచంద్రన్, కోదండం, ఫైట్ మాస్టర్ జాగ్వార్ తంగం ప్రధాన పాత్రలు పోషించారు.

చిత్ర ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలో నిర్వహించారు.. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హీరోయిన్ పారిపోవడంతో మిగిలిన కథను మార్చి ఆమె లేకుండా చిత్రాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES