సినిమా

Samantha: పాతింట్లోకి సామ్.. కొత్తింట్లోకి చైతూ..

Samantha: కొన్ని అపురూప దృశ్యాలను పంచుకుంది.

Samantha: పాతింట్లోకి సామ్.. కొత్తింట్లోకి చైతూ..
X

Samantha: నాగచైన్య ముందు నుంచి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు.. అందుకే తక్కువగా వార్తల్లో ఉంటాడు.. కానీ సమంత అలా కాదు.. ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే తన మనసులో భావాలన్నీ అభిమానులతో పంచుకుని కాస్త స్వాంతన పొందుతోంది. మంచైనా, చెడైనా నలుగురికీ పంచుకుంటే మనసు కాస్త కుదుట పడుతుందని భావించినట్లుంది.. మై మామ్ సెడ్ హ్యాష్ ట్యాగ్ తో సమంత రోజుకో పోస్ట్ పెడుతోంది.

తాజాగా న్యూ బ్రింగింగ్ బ్యాక్ అంటూ తన ఇంటికి సంబంధించిన కొన్ని అపురూప దృశ్యాలను పంచుకుంది. ఈ ఫోటోలను బట్టి చూస్తే సమంత, నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు ఉన్న ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండాలని ఆమె నిర్ణయించుకుందట.

మరోవైపు నాగచైతన్య గత ఏడాది జూబ్లీహిల్స్ లో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ ఇంటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయట. దగ్గరుండి చూసుకునేందుకు వీలుగా అక్కడే ఓ అపార్ట్ మెంట్ లో చైతూ ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం.

Next Story

RELATED STORIES