'ఆదిపురుష్' లో మొదటగా అనుకున్న హీరో ప్రభాస్ కాదట..!

ఆదిపురుష్ లో మొదటగా అనుకున్న హీరో ప్రభాస్ కాదట..!
తానాజీని ఓం రౌత్ చాలా చెత్తగా తీశాడని అన్నాడు. అది ఆదిపురుష్ తో నిరూపితం అయిందని చెప్పాడు

రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా విడుదలైనప్పటి నుంచి విమర్శలను ఎదుర్కుంటోంది. బాహుబలి లాంటి సూపర్ సక్సెస్ సాధించిన ప్రభాస్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేశారు. అయితే సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఖాన్ ఓ సంచలన ప్రకటన చేశాడు. అసలు 'ఆదిపురుష్' కు మొదటగా ఎంపికైన హీరో ప్రభాస్ కాదని, కార్తిక్ ఆర్యన్ అని చెప్పాడు.


కార్తిక్ అదృష్టం బాగుండటం వలన 'ఆదిపురుష్' చేయలేదని లేకుంటే అతను డిజాస్టర్ హీరోగా మిగిలిపోయేవాడని కమల్ ఖాన్ అన్నాడు. అంతే కాకుండా ఓం రౌత్ కు దర్శకత్వం తెలియదని మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందుకు ఉదాహరణగా 'తానాజీ' సినిమా అని చెప్పాడు. 'తానాజీ'ని ఓం రౌత్ చాలా చెత్తగా తీశాడని అన్నాడు. ఆదిపురుష్ తో అది నిరూపితం అయిందని చెప్పాడు.


సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఓం రౌత్ పై కోపంతో ఉన్నారని అన్నాడు. 'ఆదిపురుష్' లో పేలవమైన VFX, అగౌరవపరిచే డైలాగులు, సీతా దేవిని తక్కువగా చూపించిన తీరు సినిమాను దెబ్బతీసిందని అంటున్నారు. రామానంద్ సాగర్ తీసిన రామాయణంలో నటించిన నటులు కూడా 'ఆదిపురుష్' ను విమర్శించారు. ఓం రౌత్ టీం రామాయణాన్ని అపహాస్యం చేసిందని, ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు.

'ఆదిపురుష్' డైలాగ్ లపై తీవ్ర విమర్శలు రావడంతో.. మాటలు రాసిన మనోజ్ ముంతాషిర్ శుక్లా ట్విట్టర్ లో ట్రోల్స్ పై స్పందించాడు. "నేను ఆదిపురుష్ లో 4000 పంక్తులు రాసాను. కొన్ని డైలాగులు 5 లైన్లు ఉన్నాయి. మిగిలిన డైలాగులు శ్రీరామున్ని, మాతా సీతను కీర్తించేవిగా ఉన్నాయి. వాటికి నేను ఎటువంటి ప్రశంసలు అందుకోలేదు. అయినా సరే ప్రేక్షకుల అనుభూతి కంటే ఏదీ గొప్పది కాదు. నా డైలాగులకు అనుకూలంగా లెక్కలేనన్ని వివరణలు ఇవ్వగలను, కానీ ఇవి మీ బాధను తగ్గించలేవు. మిమ్మల్ని బాధపెట్టిన డైలాగులను రివైజ్ చేయాలని నేనూ, సినీ దర్శకులు, నిర్మాత నిర్ణయించుకున్నాము. డైలాగుల మార్పును సినిమాలో గమనించవచ్చు" అని అన్నారు.

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ ను అందుకున్న ప్రభాస్ జాతీయ స్థాయిలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాడని అన్నారు కమల్ ఖాన్. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కే పైనే ఉన్నాయని చెప్పారు. నెటిజన్లు ఆదిపురుష్ ను నిషేధించాలని అంటున్నారని, ఇప్పటికే ఈ సినిమా నేపాల్ లో నిషేధించబడిందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story