సినిమా

Adivi Sesh: అడివి శేష్.. అసలు పేరేంటో తెలుసా!!

Adivi Sesh: క్షణం, హిట్ వంటి చిత్రాల ద్వారా విభిన్నమైన కథాంశాలను ఎన్నుకొనే హీరోగా తన కోసం స్పెషల్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్.

Adivi Sesh: అడివి శేష్.. అసలు పేరేంటో తెలుసా!!
X

Adavi Sesh: క్షణం, హిట్ వంటి చిత్రాల ద్వారా విభిన్నమైన కథాంశాలను ఎన్నుకొనే హీరోగా తన కోసం స్పెషల్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్.వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్న అతడి సినిమాల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ తాజాగా మేజర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. జూన్ 3న సినిమా విడుదల చేయడానికి సిద్ధమైంది చిత్ర యూనిట్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా అడివి శేష్ అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యాడు..

అడివి శేష్ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు, అలీ అతడిని అడివి సన్నీ చంద్ర అని పలకరించాడు. అడివి శేష్ తన పేరును మార్చడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటి సన్నీలియోన్ బాగా ఫేమస్ అయింది.

ఆ సమయంలో తన స్నేహితులంతా సన్నీ లియోన్ అని పిలిచేవారట. దాంతో తన పేరు మార్చుకోవాలని అప్పుడే అనుకున్నాడట. సినిమాల్లోకి వచ్చాక తన పేరును అడివి శేష్‌గా మార్చుకున్నానని వెల్లడించాడు.

Next Story

RELATED STORIES