Puneeth Rajkumar: 4 సినిమాలు.. రూ. 400 కోట్ల బడ్జెట్.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి?

Puneeth Rajkumar: 4 సినిమాలు.. రూ. 400 కోట్ల బడ్జెట్.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
Puneeth Rajkumar: హీరో అంటే ఇలా ఉండాలి.. ఎంత మంది అభిమానం.. ఎన్ని కోట్ల మంది హృదయాల్లో కొలువై వున్నాడు..

Puneeth Rajkumar: హీరో అంటే ఇలా ఉండాలి.. ఎంత మంది అభిమానం.. ఎన్ని కోట్ల మంది హృదయాల్లో కొలువై వున్నాడు.. ఆయన నటించిన సినిమాల ద్వారా హీరో అయ్యాడు.. ఆయన వ్యక్తిత్వం ఆయన్ని రియల్ హీరోని చేసింది. ఓ మంచి మనిషికి ఇంత త్వరగా ముగింపా అని యావత్ భారత దేశం తల్లడిల్లింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేంత గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఉన్న నాలుగు రోజులు మంచి అనిపించుకున్నారు. ఇంక జీవితానికి ఇది చాలనుకున్నారో ఏమో.. అందర్నీ వీడి వెళ్లి పోయారు.

కారణాలు ఏవైనా మంచి మనుషులు ఎక్కువ కాలం ఉండరని మరోసారి రుజువైంది. కోట్లకు కోట్లు డబ్బు సంపాదించి ఆస్తులు పోగేసుకోవడం కాదు.. సంపాదించిన దాంట్లో కొంతైనా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఖర్చు పెట్టాలని నిరూపించారు. ఎందరో నటీ నటులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు పునీత్ రాజ్ కుమార్.. ఆయన హీరోగా నటించిన దాదాపు 80 శాతం సినిమాలు బ్లాక్ బస్టర్.. కోట్లలో పారితోషికం. ఆయనతో చేసే సినిమాలు 100 కోట్ల బడ్జెట్ దాటి పోయింది. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటో అర్థమవుతుంది.

ఆయన చేస్తున్న రెండు సినిమాలు ఒకటి జేమ్స్, రెండు ద్విత్వ.. జేమ్స్ లో బాడీ బిల్డర్ గా నటిస్తున్న కారణంగా ఆయన జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు.. ఆ చిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తై చివరి దశలో ఉంది. ద్విత్వ పరిస్థితి కూడా అదే.. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా పెట్టుబడి. డిసెంబర్ నుంచి ద్విత్వ కోసం పని చేయాలనుకున్నారు పునీత్. కానీ ఇంతలోనే అతడి మరణం. ఈ రెండు చిత్రాలు కాకుండా సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి పునీత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వీరి కాంబినేషన్లో రాజ కుమార, యువరత్న చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సూపర్ హిట్ కావడంతో మూడో సినిమాకు ముహూర్తం పెట్టారు. ఇక పునీత్ తన బ్యానర్ లో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇలా దాదాపు రూ. 400 కోట్ల పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారాయి. పునీత్ రాజ్ కుమార్ మరణం అటు కుంటుంబానికి, ఇటు ఇండస్ట్రీకి తీరని లోటు.

Tags

Read MoreRead Less
Next Story