ఏజెంట్ ఫెయిల్.. క్షమించండి ప్లీజ్: నిర్మాత అనిల్ సుంకర

ఏజెంట్ ఫెయిల్.. క్షమించండి ప్లీజ్: నిర్మాత అనిల్ సుంకర
అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ఏజెంట్..ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్‌ వేదికగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.

అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ఏజెంట్..ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్‌ వేదికగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. పలు వాయిదాల తర్వాత విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమాపై విమర్శలు వెల్లువెత్తడంతో అఖిల్ తల్లి అమల నటుడికి మద్దతుగా నిలిచారు. అఖిల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని విమర్శించారు.

నిర్మాత అనిల్ సుంకర.. “ #Agent సినిమాను సరిగా తీర్చిదిద్దనందుకు క్షమించండి. ఇది ఒక పెద్ద బాధ్యత అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని జయించాలని అనుకున్నాము. కానీ మేము స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం మేము చేసిన పెద్ద పొరపాటు. దీనికితోడు కోవిడ్‌ సమస్యలు, ఇంకా మరెన్నో ఈ చిత్రం ఫెయిల్ అయ్యేందుకు కారణమయ్యాయి.

అయినా ఇలాంటి సాకులు అన్నీ చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టకూడదనుకుంటున్నాము. అయితే ఈ ఖరీదైన తప్పు నుండి చాలా పాఠాలు నేర్చుకున్నాము. మళ్లీ తప్పులను పునరావృతం కాకుండా చూస్తాం. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు. మేము మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లను అంకితభావంతో పని చేసి నష్టాలను భర్తీ చేస్తాము అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏజెంట్ సినిమాపై వచ్చిన నెగటివ్ కారణంగా ఇండియాలో మూడు రోజుల వసూళ్లు రూ.8.85 కోట్లకు చేరాయి. హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేనికి ఏజెంట్ ఒక పెద్ద డిజాస్టర్‌ని మిగిల్చింది.

Tags

Read MoreRead Less
Next Story