Akash Puri : ఐదారేళ్లు నరకం.. అమ్మానాన్న విడాకుల వార్తలపై స్పందించిన ఆకాష్..

Akash Puri : ఐదారేళ్లు నరకం.. అమ్మానాన్న విడాకుల వార్తలపై స్పందించిన ఆకాష్..
Akash Puri : తనకి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టమని చెప్పాడు. నటుడిగా సక్సెస్ అవకపోయినా ఇండస్ట్రీలోనే మరో ఫీల్డులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.

Akash Puri: ఎవరితోనైనా క్లోజ్ గా మువ్ అయితే ఎన్నో కథలు.. ఇండస్ట్రీలో ఇవి సహజమే. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఈ చూడముచ్చటైన జంటకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.. నాన్న పేరున్న డైరెక్టర్ అయినా అభిమానులను ఆకట్టుకునేలా ఉంటేనే ఆకాష్ చిత్రాలు ఆదరిస్తారు ప్రేక్షకులు..

ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించిన ఆకాష్ మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు నటించిన తాజా చిత్రం చోర్ బజార్ విడుదలకు సిద్ధమవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆకాష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. తనకి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టమని చెప్పాడు. నటుడిగా సక్సెస్ అవకపోయినా ఇండస్ట్రీలోనే మరో ఫీల్డులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల విడాకులకు సంబంధించి వస్తున్న వార్తలపై స్పందించాడు.

సినిమా క్లిక్ అయితే నేము, ఫేము ఒక్కసారే వస్తాయి.. ఈ ఫీల్డ్ లో ఆటు పోట్లు సహజం. కష్టాలకు కృంగి పోకుండా ప్రయత్నించాలి. నాన్న పూరీ జగన్నాథ్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకానొక సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఐదారేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము.. ఆస్తులు అన్నీ పోయాయి. ఇల్లు, కార్లు అమ్మేశారు. అలాంటి పరిస్థితి నుంచి మళ్లీ మేము ఈ స్థాయికి రాగలిగామంటే మా అమ్మే కారణం.

అన్ని కష్టాల్లోనూ అమ్మ ఇచ్చిన సపోర్ట్ తో నాన్న తిరిగి నిలదొక్కుకున్నారు. వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. పెళ్లికి ముందే సినిమా ఫీల్డ్ లో ఉన్న కష్టనష్టాల గురించి వివరించారట. ఇప్పుడయితే కేవలం నా దగ్గర కేవలం రూ.200ల మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా చెప్పలేను. అని చెప్పినా అమ్మ కంగారు పడలేదు.. నాన్నకోసం అన్నీ వదులుకుని వచ్చేసింది.

వాళ్ల ప్రేమ విషయం తెలిసి నేను కూడా ఆశ్చర్యపోయా.. అని ఆకాశ్ వివరించాడు. ఇక విడిపోతున్నారన్న వార్తలకు స్పందిస్తూ.. వాటి గురించి నాకు తెలియదు.. అవన్నీ అవాస్తవాలు.. మా అమ్మానాన్న , మేము చాలా సంతోషంగా ఉన్నాము.. కొంత మందికి ఏం చేయాలో తెలియక ఇలాంటి వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని నమ్మకండి అని ఆకాశ్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story