సినిమా

Akhanda: వన్ మిలియన్ క్లబ్ లో 'బాలయ్య'.. 'అఖండ' సూపర్ సక్సెస్

Akhanda: కోవిడ్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్లో..అందులోనూ అమెరికాలో సినిమాలకు కలెక్షన్లు మునుపటిలా రావడం లేదు.

Akhanda: వన్ మిలియన్ క్లబ్ లో బాలయ్య.. అఖండ సూపర్ సక్సెస్
X

Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హాట్రిక్ మూవీ అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అఖండ మూవీ. విడుదలైన పది రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

బాలయ్య కెరీర్లో వంద కోట్లు సాధించిన ఫస్ట్ మూవీగా అఖండ చిత్రం నిలిచింది. బాలయ్య పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, బోయపాటి టేకింగ్, తమన్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించాయి. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో బి, సి సెంటర్ల ఆడియన్స్ నుంచి అఖండకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అఖండ చిత్రంతో బాలయ్య మరో ఫీట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కోవిడ్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్లో..అందులోనూ అమెరికాలో సినిమాలకు కలెక్షన్లు మునుపటిలా రావడం లేదు. ఇప్పుడు కోవిడ్ ప్రభావం కాస్త తగ్గినప్పటికీ అఖండ చిత్రం అమెరికాలో రెండు వారాలు కంప్లీట్ కాకముందే వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

2021లో అమెరికా వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన అతి తక్కువ చిత్రాల్లో అఖండ ఒకటిగా నిలిచింది. ఈ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాకి అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు రావడం స్పెషల్ అనే చెప్పాలి. US లో 1 మిలియన్ క్రాస్ అయినా...ఓవరాల్ గా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటినా అఖండ ప్రభంజనం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది.

Next Story

RELATED STORIES