Alia Bhatt: నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇది: అలియా భట్

Alia Bhatt: నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇది: అలియా భట్
Alia Bhatt: కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి, పిల్లలు అనే పెద్ద నిర్ణయం తీసుకున్న అలియ అభినందనీయురాలు..

Alia Bhatt: కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి, పిల్లలు అనే పెద్ద నిర్ణయం తీసుకున్న అలియ అభినందనీయురాలు.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా తారలకు బాగా నప్పుతుంది. వచ్చిన ఆఫర్లను వద్దనకుండా ఒకదాని తరువాత మరొకటి చేస్తుంటారు. దాంతో మూడు పదులు దాటినా మూడు ముళ్ల గురించి ఆలోచించరు. పెళ్లెప్పుడు అంటే ఇప్పుడు అంత టైమ్ లేదంటారు.. కానీ బాలీవుడ్ బ్యూటీ అలియా మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒక బేబీని కూడా కనేసింది. పైగా కెరీర్‌కి ఇవేవీ ఆటంకాలు కావు అని అంటోంది. మనలో సత్తా ఉండి, చేయాలన్న జీల్ ఉంటే ఆఫర్లు వాటంతట అవే వస్తాయి అని తనని తాను గట్టిగా నమ్ముతోంది. ఆఫ్‌కోర్స్ ఇప్పటికే తానొక మంచి నటిని అని ప్రూవ్ చేసుకుంది.


కెరీర్‌‌కి పెళ్లి, మాతృత్వం అడ్డంకి కాదా అని ప్రశ్నించిన వాళ్లకి అద్దిరిపోయే ఆన్సర్ ఇస్తోంది అలియా. ఒకవేళ అలా జరిగితే, బిడ్డ పుట్టడమే తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయమని, మిగతావి ఏవీ తాను పట్టించుకోనని పేర్కొంది.


ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోన్న అలియా గత ఏడాది గర్భం దాల్చిన వార్తను ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు బిడ్డను కనాలని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశ్నించారు.



నవంబరు 6న రాహాను స్వాగతించిన అలియా.. తన పని మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంది. తాను తీసుకున్న నిర్ణయాలపట్ల తాను ఎప్పుడూ చింతించలేదని పేర్కొంది. జీవితంలో ఇది సరైనది, ఇది కాదు అని చెప్పడానికి ఏమీ ఉండదని వివరించింది. ఎందుకంటే ఒకరికి సరిగా అనిపించింది, మరొకరికి తప్పు అని అనిపించవచ్చు. ఒక వ్యక్తి జీవితాన్ని ప్లాన్ చేసుకోలేడని, జీవితం తనను తాను ప్లాన్ చేసుకుంటుందని, ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అలియా పేర్కొంది.


"నేను ఎప్పుడూ నా మనసు చెప్పే మాటనే వింటాను.. అది సినిమాలైనా లేదా మరేదైనా సరే. జీవితంలో, బిడ్డను కనాలనే నిర్ణయానికి నేను ఎప్పుడూ చింతించను. తల్లిగా ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నాను. ఒక వ్యక్తి మంచి నటుడిగా ఉండి కష్టపడి పనిచేస్తే ఆ వ్యక్తికి అవకాశాలు వస్తాయని చెప్పింది. ఒకవేళ మీకు అవకాశాలు రాలేదనుకోండి.. బాధపడకండి.. బహుశా ఇది మీ టైమ్ కాకపోవచ్చు. వెయిట్ చేయండి అని అలియా వివరించింది.


సినిమా కెరీర్ గురించి ఎప్పుడూ పెద్దగా ఆలోచించనని అలియా పేర్కొంది. తన పనికి చాలా విలువ ఇస్తూనే, తన జీవితాన్ని అంతకు మించి విలువైనదిగా భావిస్తానని అంటోంది. అందువల్ల ఆమె రెండింటి మధ్య సమతుల్యతను సాధించాలని కోరుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story