Allu Arjun: ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు.. ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రేమను కురిపించిన బన్నీ..

Allu Arjun: ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు.. ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రేమను కురిపించిన బన్నీ..
Allu Arjun: అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తనపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

Allu Arjun: అల్లు అర్జున్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తనపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన పుష్ప ఫేమ్ అల్లు అర్జున్, చిత్ర పరిశ్రమలో తన విజయవంతమైన 20 సంవత్సరాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. అతను తన సోషల్ మీడియా హ్యాండి‌ల్‌లో ఈ వార్తనుపంచుకుంటూ ఇలా వ్రాశాడు, ”ఈ రోజుతో నేను చిత్ర పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నేను ఇక్కడ వరకు వచ్చానంటే అది మీరు నా పట్ల చూపించిన ప్రేమ, అభిమానమే కారణం అని రాసుకొచ్చారు. ఇండస్ట్రీకి చెందిన నా వారందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల ఆరాధన, ప్రేమకు నేను కట్టుబడి ఉన్నాను. ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను అని పేర్కొన్నారు.

40 ఏళ్ల అల్లు అర్జున్ 2003 లో గంగోత్రితో కథానాయకుడిగా అరంగేట్రం చేశాడు. అయితే 1985లోనే చిరంజీవి విజేత చిత్రంలో బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2001లో వచ్చిన డాడీ అనే చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా కనిపించాడు. అతని తొలి చిత్రం సి అశ్విని దత్‌తో కలిసి అల్లు అరవింద్ నిర్మించారు. 2004లో వచ్చిన చిత్రం ఆర్యతో విజయాన్ని అందుకున్నాడు. అతని అద్భుతమైన నటనకు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకున్నాడు. బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, జులాయి, రేసు గుర్రం, సర్రైనోడు, అల వైకుంఠపురములో వంటి చిత్రాలు అతడి కెరీర్‌లో టాప్‌గా నిలిచాయి. పుష్ప: ది రైజ్‌తో పాన్-ఇండియా స్టార్ అయ్యాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రం తెలుగు సినిమా మాత్రమే కాకుండా భారతదేశం అంతటా అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పుష్ప సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది మరియు ఈ ఏడాది చివర్లో సినిమాల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story