సినిమా

Allu Arjun Pushpa: ఈసారి పక్కా.. 'పుష్పరాజ్' రిలీజ్ డేట్ ఫైనల్..

Allu Arjun Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. లెక్కల మాస్టార్ సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే ఆ లెక్కే వేరు.

Allu Arjun Pushpa: ఈసారి పక్కా.. పుష్పరాజ్ రిలీజ్ డేట్ ఫైనల్..
X

Allu Arjun Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. లెక్కల మాస్టార్ సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే ఆ లెక్కే వేరు. ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పుష్పరాజ్ అప్పుడొస్తున్నాడు.. ఇప్పుడొస్తున్నాడు అంటూ వాయిదాల పద్దతి కొనసాగుతోంది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 17న పుష్ప మూవీ పక్కా వచ్చేస్తోందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. క్రిస్మస్ కానుకగా పుష్ప ఫస్ట్ పార్ట్‌ను పుష్ప ది రైజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ వింత గెటప్ ఈసారి అభిమానులను అలరించనున్నాడు. రష్మిక మందన అతడితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఆమెది కూడా డీ గ్లామర్ రోల్. దేవిశ్రీ సర్వకల్పనలో వస్తోన్న ఈ మూవీ మైత్రీ మూవీ పతాకంపై నిర్మితమవుతోంది.

Next Story

RELATED STORIES