కూతురుకి ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బీ

కూతురుకి ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బీ
ఎనభైల్లో ఉన్నా ఏ మాత్రం అలసట కనపడనివ్వకుండా ఇష్టంగా కష్టపడుతుంటారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.

ఎనభైల్లో ఉన్నా ఏ మాత్రం అలసట కనపడనివ్వకుండా ఇష్టంగా కష్టపడుతుంటారు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్. కోట్ల ఆస్థి కూర్చుని తిన్నా కరగదు.. అయినా పనిలోనే ఆనందం వెతుక్కుంటారు. సమయాన్ని పాటిస్తూ సిన్సియర్ గా కష్టపడుతూ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తారు అమితాబ్.

ఇప్పటికీ నటనపై మక్కువతో ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తుంటారు. ఇక టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి గురించి అయితే చెప్పక్కరలేదు. ఆయన వల్లే ఆ షో అంత బాగా సక్సెస్ అయిందంటే అతిశయోక్తి కాదు.

అమితాబ్ తన కూతురు శ్వేతా బచ్చన్ కు ముంబైలో ఉన్న జుహూ బంగ్లా ప్రతీక్షను బహుమతిగా ఇచ్చారు. నవంబర్ 8న గిఫ్ట్ డీడ్‌పై సంతకం చేసి, రూ. 50.65 లక్షలు స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. విఠల్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పరిధిలోకి వచ్చే ఈ బంగ్లా రెండు ప్లాట్లలో విస్తరించి ఉంది. ప్లాట్ల పరిమాణం 890.47 చదరపు మీటర్లు మరియు 674 చదరపు మీటర్లు. ఆస్తి విలువ రూ. 50 కోట్లు. ప్రతీక్ష అమితాబ్ బచ్చన్ నివసిస్తున్న ఇల్లు జల్సా నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది.

అమితాబ్ కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ప్రతీక్ష. ఆయన తన తల్లిదండ్రులు లెజెండరీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్తో కలిసి నివసించేవారు. ఈ ఇంటికి అమితాబ్ తండ్రి ప్రతీక్ష అని పేరు పెట్టారు.

క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 14లో అమితాబ్ బచ్చన్ ఈ ఇంటి గురించి చెప్పుకొచ్చారు. "ఈ పేరు మా నాన్న పెట్టింది. ఆయన రాసిన కవితలో 'స్వగత్ సబ్కే లియే యహాన్ పర్ నేహిన్ కిసికే లియే ప్రతీక్ష' అని ఒక లైన్ ఉంది". అక్కడే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల వివాహం జరిగింది అని తెలిపారు.

అమితాబ్ బచ్చన్ కు తన కుమార్తె శ్వేతా బచ్చన్‌ అంటే ఎనలేని ప్రేమ. లెజెండరీ నటుడి పుట్టినరోజు సందర్భంగా, శ్వేత ఇద్దరికి సంబంధించిన కొన్ని సంతోషకరమైన చిత్రాలను ఎంచుకుని, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆమె నోట్‌లో, “81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న పప్పాకు శుభాకాంక్షలు. మీరు మా పై చూపిస్తున్న ప్రేమను ఎవరూ భర్తీ చేయలేను అని పేర్కొంది.

అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ ' కల్కి 2898 - AD లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ది ఇంటర్న్ హిందీ రీమేక్‌లో దీపికతో బిగ్ బి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story