Anasuya Bharadwaj: 'బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌‌'గా అనసూయ

Anasuya Bharadwaj: బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌‌గా అనసూయ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అలనాటి నటిని గుర్తు చేసుకున్న అనసూయ

'జబర్ధస్త్' కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాపులారిటీ దక్కించుకున్న అనసూయ భరద్వాజ్.. ఇటీవలి కాలంలో వెండి తెరపైనా కనిపిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన ఆమె.. 'పుష్ప' మూవీలో 'దాక్షాయణి'గా నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఇక తాజాగా అనసూయం ఓ ఆసక్తికర పోస్టును పంచుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయురాలు, అలనాటి నటి బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తు చేసుకుంది. అచ్చం బేగంలాగే ముస్తాబైన ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

“ 1857 కాలం నాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలు, ఆవాధీ క్వీన్ బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను. దేశం కోసం ఆమె ఎంతో పోరాటం చేశారు. తన పోరాటానికి గుర్తుగా 1984 మే 10న ఆమె ఫొటోతో ప్ర‌భుత్వం పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేసింది. ఈ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌ర్చిపోయిన పోరాట యోధురాలిని గుర్తు చేసుకుందాం” అంటూ అనసూయ ట్వీట్ లో రాసుకువచ్చింది.

ఇక ఆగస్టు 15న 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశమంతా సిద్ధం అవుతోంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించిన నేపథ్యంలో జరుపుకునే ఈ చారిత్రాత్మక రోజును గుర్తు చేసుకుంటూ ఏటా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మారుమూల పల్లెల నుంచి నగరాల వరకు జరుపుకునే ఈ జాతీయ పండుగను జరుపుకునేందుకు అంతా సన్నాహులై ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ చేసిన పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది.

బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ ఎవరంటే ?

బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ అలనాటి అందాల నటి. ఎన్నో చిత్రాల్లో తన అద్భుత అభినయంతో అందరినీ అలరించింది. ఆ తర్వాత 1857లో దేశం కోసం సంగ్రామం మొదలయ్యింది. సిపాయిల తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. సినిమా తారగా ఉన్న బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌.. మాతృదేశ విముక్తి పోరాటంలో అడుగు పెట్టింది. తొలి విడత స్వాతంత్ర్య సంగ్రామంలో తన వంతు భాగస్వామ్యాన్ని అందించింది. భారతదేశపు తొలి మహిళా స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా నిలిచింది. సినిమాలను పక్కన పెట్టి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను, ఎన్నో నిర్భందాలను ఎదుర్కొంది. స్వాతంత్ర్య సమరం తర్వాత స్వతంత్ర భారతం ఆమె గొప్ప పోరాటాన్ని గుర్తించింది. మే 10, 1984న భారత ప్రభుత్వం ఆమె ఫోటోతో పోస్టల్ స్టాంపును విడుదల చేసి, ఆమె పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది. “స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ధైర్యం, నిబద్ధతతో మనకు స్ఫూర్తినిచ్చే బేగం హజ్రత్ మహల్ లాంటి మరచిపోయిన వీరులను స్మరించుకుందాం” అంటూ అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story