సినిమా

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం..

Anasuya Bharadwaj: ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అనారోగ్యంతో మరణించడం మనం చూస్తూనే ఉన్నాం.

Anasuya Bharadwaj (tv5news.in)
X

Anasuya Bharadwaj (tv5news.in)

Anasuya Bharadwaj: ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అనారోగ్యంతో మరణించడం మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాక సెలబ్రిటీల ఇంట్లో వ్యక్తులు, వారి సన్నిహితుల మరణ వార్తలు కూడా రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా యాంకర్ అనసూయ ఇంట్లో అలాంటి ఓ విషాదమే చోటుచేసుకుంది.

జబర్దస్త్ యాంకర్ అనసూయ తండ్రి సుదర్శన్ రావు ఉదయం అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్‌లోని తార్నాకలోని వీరి సొంత నివాసంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రావు కాసేపటికే కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు.

అనసూయ బుల్లితెరపై స్టార్ సెలబ్రిటీ అయినా.. తన తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ పెద్దగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. సుదర్శన్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణం వల్ల అనసూయ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES