సినిమా

Jayamma Panchayati: జయమ్మ పంచాయితీ షురూ.. సుమ దంచేస్తోంది

Jayamma Panchayati: అంతకు ముందు అడపా దడపా సినిమాల్లో నటించినా తనకు సిల్వర్ స్క్రీన్ సరిపడదని అక్కడి నుంచి తప్పుకుంది.

Jayamma Panchayati: జయమ్మ పంచాయితీ షురూ.. సుమ దంచేస్తోంది
X

amma Panchayati: మోస్ట్ వాంటెడ్ యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే సుమ అని టక్కున చెప్పేస్తారు.. పరిచయం అక్కరలేని పేరు.. బుల్లితెరని చింపేస్తుంది.. అంతకు ముందు అడపా దడపా సినిమాల్లో నటించినా తనకు సిల్వర్ స్క్రీన్ సరిపడదని అక్కడి నుంచి తప్పుకుంది. మరిప్పుడు జయమ్మ పంచాయితీ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. యాంకర్‌గా పలు షోలు, మూవీ రిలీజ్ ఫంక్షన్లు చేస్తూ బిజీగా ఉన్న సుమకు సినిమా చేసేంత ఖాళీగా ఉందా అని ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

సుమ తలుచుకోవాలేగానీ ఎన్ని పాత్రలనైనా అవలీలగా పోషించేస్తుంది.. ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ, పంచులు వేస్తూ ఎదుటి వారిని నవ్వించే పనిలోనే ఉంటుంది. మరి జయమ్మ పంచాయితీ పోస్టర్ చూస్తుంటే సీరియస్‌గా కనిపిస్తోంది.. తన పంచాయితీలో తీర్పులు ఫన్నీగా ఉంటాయో, సీరియస్‌గా ఉంటాయో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రామ్ చరణ్ ఈరోజు ఆవిష్కరించారు. విజయ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ఈ మోషన్ పోస్టర్‌ని ఇక్కడ చూడండి. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయిందని తెలిపింది చిత్ర యూనిట్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES