Suma-Roshan: అమ్మకి వయసు తగ్గుతుంటే కొడుక్కి వయసు పెరుగుతోంది.. రోషన్ తో సుమ

Suma-Roshan: అమ్మకి వయసు తగ్గుతుంటే కొడుక్కి వయసు పెరుగుతోంది.. రోషన్ తో సుమ
Suma-Roshan: ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లైనా యాంకర్ సుమ హవా తగ్గలేదంటే.. ఆమె ఏమైనా అమృతం తాగిందేమో అని తోటి యాంకర్లు ఆశ్చర్యపోతుంటారు..

Suma - Roshan: ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లైనా యాంకర్ సుమ హవా తగ్గలేదంటే.. ఆమె ఏమైనా అమృతం తాగిందేమో అని తోటి యాంకర్లు ఆశ్చర్యపోతుంటారు.. షూట్లు ఎన్ని ఉన్నా ఒంటి చేత్తో రఫ్పాడించేస్తుంది.. ఏ మాత్రం అలసట కనబడనివ్వకుండా అదే ఎనర్జీ, అవే పంచులతో ఆకట్టుకుంటుంది సుమ యాంకరింగ్..

ఇంటర్వ్యులు, ప్రీ లాంచింగ్ లు, షోలు ఎక్కడ చూసిన సుమనే కనిపిస్తుంది. అన్నీ చేస్తూనే ఇంట్లో ఆవకాయని, పులిహోరని కూడా అద్భుతంగా కలిపేస్తుంది. కొడుకు రోషన్ ని హీరోని చెయ్యాలని కలలు కంటున్నారు సుమ, రాజీవ్ లు.

నిర్మలా కాన్వెంట్ ద్వారా ఎంట్రీ ఇచ్చి పై చదువులకని విదేశాలకు వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు. గత ఏడాది రోషన్ తో ఓ సినిమాను ప్లాన్ చేశారు సుమ దంపతులు. ఇందుకు సంబంధించిన పూజాకార్యక్రమాలు కూడా నిర్వహించారు.. కానీ దానికి సంబంధించిన అప్డేడ్ లు ఏవీ తరువాత రాలేదు..

ఇదిలా ఉంటే రోషన్ పుట్టినరోజు (మార్చి 15) సందర్భంగా అమ్మ సుమతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతూ ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాకవుతున్నారు..

అమ్మ.. 40ల్లోనూ నన్నెవరూ బీట్ చేయలేరు అటు యాంకరింగ్ లో కానీ, ఇటు వయసులో కానీ అన్నట్లు ఉంటే.. కొడుకేంటి యంగ్ ఏజ్ లోనే ఎంతో మెచ్యూర్డ్ గా, పెద్దవాడిలా కనిపిస్తున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు.

సుమ, రోషన్ తల్లి కొడుకులు కాదు అక్కా తమ్ముళ్లు అని కామెంట్ చేస్తున్నారు. రోషన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూనే అతడిపై సెటైర్లు వేస్తున్నారు.

క్యాజువల్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న రోషన్ ని చూసి హీరోకి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అని అంటున్నారు. చూడాలి ఏ దర్శకుడితో కలిసి పని చేస్తాడో. కాగా, సుమ నటించిన జయమ్మ పంచాయితీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story