ప్రియాంక చోప్రా ముక్కు సర్జరీ గురించి దర్శకుడు అనిల్ శర్మ..

ప్రియాంక చోప్రా ముక్కు సర్జరీ గురించి దర్శకుడు అనిల్ శర్మ..
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత తమ అందాన్ని మరింత మెరుగు పరుచుకోవాలనుకుంటారు హీరో హీరోయిన్లు.

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత తమ అందాన్ని మరింత మెరుగు పరుచుకోవాలనుకుంటారు హీరో హీరోయిన్లు. అందుకోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయిస్తుంటారు. అవి ఒక్కోసారి సక్సెస్ అవుతుంటాయి. మరోసారి మొదటికే మోసం వస్తుంది. ఉన్న అందం కూడా పోతుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విషయంలో కూడా అదే జరిగింది అని గదర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు అనిల్ శర్మ చెప్పుకొచ్చారు.

అనిల్ శర్మ ప్రియాంక చోప్రాతో ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్ఫై చేశారు. ఆ చిత్రానికి ప్రియాంక సైన్ చేసిన తరువాత అడ్వాన్స్ చెక్కు కూడా ఇచ్చింది నా భార్య. గదర్ విడుదలైన తర్వాత నేను అమెరికా, యూరప్‌కు విహారయాత్రకు వెళ్లాను. రెండు నెలల తర్వాత నేను తిరిగి వచ్చాను. ప్రియాంక జూలియా రాబర్ట్స్‌లా కనిపించాలని కోరుకుంటూ ఆమె ముక్కుకు ఆపరేషన్ చేయించుకుందని పేపర్లలో చదివాను. ఎందుకు ప్రియాంక ఈ పని చేసిందని ఆశ్చర్యపోయాను. అప్పటికే ఆమె చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ ఆపరేషన్ చేయించుకుని ఉన్న అందాన్ని పాడు చేసుకుంటుంది అని అనుకున్నాను.

నేను వెంటనే ఆమెకు కబురు పెట్టాను. ఒకసారి వచ్చి కలవమని. మరుసటి రోజు ప్రియాంక తన తల్లితో కలిసి వచ్చింది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు, వారు ఆపరేషన్ గురించి నాకు చెప్పారు. ఇది ఆమె ముక్కు కింద కూడా గుర్తును మిగిల్చింది. అది నేటికీ అలాగే ఉంది. కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందని చెప్పి బాధపడ్డారు. దాంతో అప్పటికే ప్రియాంక సంతకం చేసిన అనేక ప్రాజెక్ట్‌ల నుండి తొలగించబడిందని చెప్పి తల్లి వాపోయింది.

నేను సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి నాకు కూడా ఇవ్వాలనుకున్నారు. నేను వద్దని వారించి వారికి అండగా నిలిచాను. మచ్చను కప్పిపుచ్చడానికి మేకప్ ఆర్టిస్ట్‌ని పిలిచి , స్క్రీన్ టెస్ట్ చేయించాను. దాంతో ఆమె ఎప్పటిలాగే అందంగా కనిపించింది అని వివరించారు అనిల్ శర్మ. సెలబ్రెటీలు చాలా మంది ఆపరేషన్లు చేయించుకున్నవారే. నిజానికి వారు ముందరే అందంగా ఉన్నారు. ఆ విషయం వారికి కూడా తెలుసు.

Tags

Read MoreRead Less
Next Story