Anushka Shetty: అనుష్క ఆ సినిమా కోసం మళ్లీ వెయిట్ గెయిన్..

Anushka Shetty: అనుష్క ఆ సినిమా కోసం మళ్లీ వెయిట్ గెయిన్..
Anushka Shetty: పెరిగిన బరువు తగ్గాలంటే ఎంత కష్టం.. సైజ్ జీరో కోసం బాగా వెయిట్ పెరిగింది అందాల తార అనుష్క. అప్పటి నుంచి ఎంతో కష్టపడుతుంటే ఈ మధ్య ఒక రూపానికి వచ్చినట్లు కనబడుతోంది.

Anushka Shetty: పెరిగిన బరువు తగ్గాలంటే ఎంత కష్టం.. సైజ్ జీరో కోసం బాగా వెయిట్ పెరిగింది అందాల తార అనుష్క. అప్పటి నుంచి ఎంతో కష్టపడుతుంటే ఈ మధ్య ఒక రూపానికి వచ్చినట్లు కనబడుతోంది. సినిమాల్లో కూడా అవకాశాల్లేవు.. తానే నటనకు కొంత కాలం విరామం తీసుకుందేమో అనిపిస్తోంది. ఆమె నటించిన చివరి చిత్రం నిశ్శబ్ధం కూడా అభిమానులను నిరాశపరిచింది. తాజాగా నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న అనుష్క.. సినిమాలోని తన పాత్ర కోసం మళ్లీ లావయ్యే పనిలో ఉందట.

నిజానికి సైజ్ జీరో మెయింటెయిన్ చేయాలని హీరోయిన్లు ఆరాట పడుతుంటారు. జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేసి ఏమాత్రం ఒక్క ఇంచు కూడా పెరగకుండా జాగ్రత్తపడుతుంటారు.. లావయిపోత అవకాశాలు రావు.. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా అదే ఫిగర్ మెయింటెయిన్ చేస్తూ అవకాశాలు సొంతం చేసుకుంటున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. మరి అనుష్క ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2015లో, అనుష్క శెట్టి సైజ్ జీరో చిత్రం కోసం తన పాత్రకు సరిపోయేలా సహజంగా బరువు పెరగడం ద్వారా సంప్రదాయమూస పద్ధతులను బ్రేక్ చేసింది. అప్పట్లో ఈ పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగింది. తాజా సమాచారం ఏమిటంటే, అనుష్క తన రాబోయే చిత్రం కోసం మళ్లీ బరువు పెరగడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి మహేష్ పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ పొలిశెట్టి కలిసి నటిస్తున్న అనుష్క.. ఈ చిత్రం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. 7 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమా కోసం ఆమె ఈసాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన తాజా లుక్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story