సినిమా

Ariyana Glory: ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అరియానా అదరహో..

Ariyana Glory: తాజాగా ఊ అంటావా పాట ట్రెండ్ అవుతోంది.. యాంకర్, నటి, బిగ్ బాస్ బ్యూటీ అరియానాకి కూడా ఈ స్పెషల్ సాంగ్ తెగ నచ్చేసినట్లుంది..

Ariyana Glory:  ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అరియానా అదరహో..
X

Ariyana Glory: కొన్ని పాటలు అంతే.. ఊపొస్తుంది.. ఊగిపావాలనిపిస్తుంది.. ఈ మధ్య సినిమాల్లో వస్తున్న స్పెషల్ సాంగ్స్ అన్నింటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్స సినిమాలోని స్పెషల్ సాంగ్‌కి సమంత స్టెప్పులేయడంతో ఆ పాటకి మరింత క్రేజ్ వచ్చింది.

నిన్న మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్‌లోని నాటు పాటకు, అంతకు ముందు ప్రైవేట్ సాంగ్ బుల్లెట్ బండి పాటకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్టెప్పులేశారు.. తాజాగా ఊ అంటావా పాట ట్రెండ్ అవుతోంది.. యాంకర్, నటి, బిగ్ బాస్ బ్యూటీ అరియానాకి కూడా ఈ స్పెషల్ సాంగ్ తెగ నచ్చేసినట్లుంది.. ఊ అంటావా మావా అంటూ ఊగిపోతోంది.

రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది అరియానా. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఊ పాటకు థియేటర్ మొత్తం ఊగిపోతుందేమో చూడాలి.

Next Story

RELATED STORIES