Mukku Avinash: అనూజతో అవినాష్ పెళ్లి.. అరియానా రియాక్షన్

ముక్కు అవినాష్ ఎట్టకేలకు తన ముచ్చట తీర్చుకోబోతున్నాడు. బిగ్‌బాస్‌లో హౌస్‌లో ఉన్నన్ని రోజులు పెళ్లి ప్రస్తావన..

Mukku Avinash: అనూజతో అవినాష్ పెళ్లి.. అరియానా రియాక్షన్
X

Mukku Avinash: ముక్కు అవినాష్ ఎట్టకేలకు తన ముచ్చట తీర్చుకోబోతున్నాడు. బిగ్‌బాస్‌లో హౌస్‌లో ఉన్నన్ని రోజులు పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఒక్క రోజు కూడా ఉండేవాడు కాదు. సరదాగా అందర్నీ నవ్విస్తూనే తన పెళ్లి టాపిక్ ఎత్తేవాడు.

హోస్ట్ నాగార్జున కూడా అవినాష్ పెళ్లిపై సెటైర్లు వేస్తూ అతడిని ఓ ఆట ఆడుకునేవారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక అరియానా, అవినాష్ అనేక ఈవెంట్లు కలిసి చేసినా, గోవా ట్రిప్‌కి వెళ్లినా అరియానాను కాదని అనూజను చేసుకోవడం ఒకింత షాకే అయినా ఫుల్ క్లారిటీతో ఉన్నాడని ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు.

మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని ఇద్దరూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అవినాష్.. అనూజను పెళ్లి చేసుకోవడం తనక్కూడా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది అరియానా. ఇక పెళ్లెప్పుడంటూ తనను అడిగిన వారికి సమాధానం చెబుతూ.. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నానని మరో రెండు వారాల్లో కొత్త సినిమా ప్రాజెక్ట్ వివరాలు తెలియజేస్తానని చెప్పింది. బాగా డబ్బు సంపాదించిన తరువాత పెళ్లి చేసుకుంటానని బదులిచ్చింది.

Next Story

RELATED STORIES