Arun Pandiyan: అందుకే తమిళనాడులో ఇతర భాషా చిత్రాలు..: నిర్మాత షాకింగ్ కామెంట్స్

Arun Pandiyan: అందుకే తమిళనాడులో ఇతర భాషా చిత్రాలు..: నిర్మాత షాకింగ్ కామెంట్స్
Arun Pandiyan: ఈరోజు, తమిళ సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇతర భాషా చిత్రాలన్నీ తమిళనాడులో అనూహ్యంగా మంచి వసూళ్లను సాధిస్తున్నాయి

Arun Pandiyan: ఒకప్పుడు తమిళ సినిమా స్వర్ణయుగం ఇప్పుడు కాదని అన్నారు ప్రముఖ నిర్మాత, నటుడు అరుణ్ పాండియన్. సినిమా తీస్తున్న ఖర్చుకంటే హీరోల రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

'ఆధార్' సినిమా ఆడియో లాంఛింగ్ కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ పాండియన్ మాట్లాడుతూ.. ''దర్శకుడు శరవణన్ తమిళ సినిమా ప్రస్తుత కాలాన్ని గోల్డెన్ పీరియడ్" అని తప్పుగా పేర్కొన్నాడు. దర్శకుడు భారతీరాజా లాంటి వాళ్లు సినిమాలు తీస్తున్న కాలం స్వర్ణయుగం. మేం సినిమాల్లో నటిస్తున్నప్పుడు అలా ఉండేది.. కానీ ఇప్పుడు అలా కాదు అని ఆయన అన్నారు.

ఈరోజు, తమిళ సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇతర భాషా చిత్రాలన్నీ తమిళనాడులో అనూహ్యంగా మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. నేను ఇటీవల విడుదలైన చిత్రాల గురించి మాట్లాడుతున్నాను. అది విజయ్ సినిమా అయినా, అజిత్ సినిమా అయినా, వాళ్ళు తమ సినిమాల కోసం ఖర్చు పెట్టరు. "వారు (హీరోలు) 90 శాతం తమ రెమ్యునరేషన్ గా తీసుకుంటే, కేవలం 10 శాతం మాత్రం సినిమా నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు.. పరిస్థితి ఇలా ఉంటే ఇంక ఎవరైనా సినిమాలు ఎలా తీయగలరు? ఒక్కరు కూడా సినిమాలు తీయడానికి ముందుకు రాలేరు. ఈ పద్ధతిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అరుణ్ పాండియన్ అన్నారు.

"మేము సినిమాలు చేసినప్పుడు, కేవలం 10 శాతం రెమ్యునరేషన్ కోసం ఖర్చుపెట్టేవాళ్లం. తొంభై శాతం సినిమా మేకింగ్ వైపు వెళ్ళేది. అది పాటించినప్పుడే ఇతర భాషా చిత్రాలతో పోటీ పడగలం.

''అప్పట్లో మా కథలు, మేకింగ్‌తో మేం గెలిచాం. ఇప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. 'ఆధార్' సినిమా హీరో కరుణాస్ తన పారితోషికంగా పైసా కూడా తీసుకోలేదని విన్నాను. అతనికి హ్యాట్సాఫ్. ఈ చిత్రంలో నటించిన తాను కూడా రెమ్యునరేషన్ చాలా తక్కువ తీసుకున్నానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story