Nayanthara : భర్త అయితే ఎంటీ...రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే...

Nayanthara : భర్త అయితే ఎంటీ...రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే...

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో భారీ పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార (Nayanthara) ఒకరు. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు.. పలు సినిమాల్లో నటించి హిట్లు అందుకుంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ అదరగొడుతోంది. రీసెంట్ గా జయం రవి హీరోగా వచ్చిన 'ఇరైవన్ ' సినిమాలో నయనతార నటించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం 'అన్నపూర ణి' సైతం నిరాశపరిచింది. ప్రస్తుతం మాధవన్, సిద్ధార్థ్ కలిసి టెస్ట్ చిత్రంలో ఆమె నటిస్తుంది. తాజాగా సెంథిల్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని తన సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహా లు చేస్తున్నట్లు సమాచారం.

వరుస ఫ్లాప్స్ అందుకుంటున్న నయనతార ఈ సినిమా తోనైనా హిట్ కొట్టాలని భావిస్తోంది. కాగా భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' (ఎల్ఐసీ). ఈ సినిమాలో హీరో అక్క పాత్రలో నయనతార నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో నయనతార పాత్ర పరి మితంగా ఉండటంతో రెమ్యునరేషన్ ను కాస్త తగ్గించు కోవాలని నిర్మాతలు కోరారట. దానికి ఆమె ఏ మాత్రం ఒప్పుకోలేదట. ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేందుకు కూడా సిద్దమైందట. భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా అయినప్పటికీ పారితోషికం విషయంలో తగ్గను అంటూ నయనతార నిర్మొహమాటంగా చెప్పడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story