Cinema: మరో సారి ఒకే సినిమాలో..!

Cinema: మరో సారి ఒకే సినిమాలో..!
ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నెరవేరనున్న ఇన్నాళ్ల కల

రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి... వెండి తెరపై అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరు. సౌత్ ఆడియన్స్‌లో వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగానే ఉంటుంది. వీరిద్దరూ గతంలో 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి పార్ట్ 1', 'పార్ట్ 2' సినిమాలకు కలిసి పనిచేశారు. దీంతో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి బాగానే పాపులర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు మంచి హిట్ కొట్టడంతో వారి అభిమానులు మరోసారి పెద్ద తెరపై వారిని కలిసి చూడాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వారి కోరిక నెరవేరబోతున్నట్లు కనిపిస్తోంది. అభిమానులకు ఆనందాన్ని కలిగించే ఈ అంశంలో, అనుష్క శెట్టిస ప్రభాస్‌ల డైనమిక్ ద్వయం మరోసారి వెండితెరను పంచుకోవడానికి సిద్ధంగా ఉంది.

బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ మరోసారి ప్రభాస్ , అనుష్క జంటగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అతనితో మరో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ అద్భుతమైన సినిమాలో.. మోస్ట్ పాపులర్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కలిగిన జంటను ప్రధాన పాత్రలు పోషించాలని కోరుకుంటున్నాడట. వాళ్లే ప్రభాస్, అనుష్క అని సమాచారం. ఈ వార్త నిజమైతే, త్వరలో మరోసారి బిగ్ స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీని చూడబోతున్నాం. వీరిద్దరిని కలిసి మరోసారి పెద్ద తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఇంతకు ముందు నటించిన సినిమాలకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారన్న వార్త నిజం అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని, కలెక్షన్లు సైతం రికార్డ్ స్థాయికి చేరుకుంటాయని, ఇదొక ఎపిక్ ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ప్రభాస్ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఆయన వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నారు. అందులో భాగంగా చేస్తోన్న మరో భారీ సినిమా కల్కి 2898 . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story