బేబీ సక్సెస్ మీట్.. పుష్ప 2 డైలాగ్ లీక్..

బేబీ సక్సెస్ మీట్.. పుష్ప 2 డైలాగ్ లీక్..
పుష్ప సినిమాలోని డైలాగ్ సినీ ప్రియులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పుష్ప సినిమాలోని డైలాగ్ సినీ ప్రియులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2లో అల్లు అర్జున్ ఎలాంటి పంచ్ డైలాగ్ చెప్పబోతున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు.

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేబీ మూవీని అభినందిస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ ని వేదికపై చూస్తే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు.. పుష్ప-2 డైలాగ్ చెప్పమని గోల చేయడంతో అల్లు అర్జున్ చెప్పక తప్పలేదు. పుష్ప గాడి రూల్.. ఏం జరిగినా అది పుష్ప రూల్ ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ బేబీ సక్సెస్ మీట్ లో పుష్ప 2 డైలాగ్ చెబుతానని తాను అనుకోలేదని అల్లు అర్జున్ చెప్పాడు. ఏది ఏమైనా ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తగ్గేదేలే స్థానాన్ని ఇప్పుడు ఈ డైలాగ్ ఆక్రమిస్తుందేమో చూడాలి.

రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోన్న పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు దీనిని నిర్మిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story