Bahubali: ఆరేళ్ల తర్వా త బాహుబలి ఖాతాలో కొత్త రికార్డ్..

bahubali (tv5news.in)

bahubali (tv5news.in)

Bahubali: ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా బాహుబలి.

Bahubali: ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు కాబట్టే రాజమౌళి అంత పెద్ద హిట్‌ను టాలీవుడ్‌కు అందించగలిగాడు. 2015లో బాహుబలి ది బిగినింగ్ విడుదలయ్యింది. సినిమా విడుదలయ్యి ఆరు సంవత్సరాలు అయినా ఇంకా దీనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ బాహుబలి టీవీలో వస్తుంది అనగానే టీవీకే అతుక్కుపోయే ప్రేక్షకులు ఉన్నారు. అందుకే వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా బాహుబలి ఎన్నో రికార్డులను సృష్టించింది. తాజాగా బాహుబలి ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది.

కీరవాణి సంగీతానికి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి, కీరవాణి కలిసారంటే ఆ సినిమా మ్యూజికల్ హిట్ అవ్వాల్సిందే. ఆ లిస్ట్‌‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది బాహుబలి. సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చడంలో మ్యూజిక్ కూడా ఒక ముఖ్య కారణంగానే నిలిచింది. అందుకే ఆరు సంవత్సరాల తర్వాత మ్యూజిక్ విషయంలో ఒక రికార్డును కొల్లగొట్టింది.

తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా బాహుబలి పాటలు హిట్. తెలుగులో 'ఎవ్వడంట ఎవ్వడంట' పాట హిందీలో 'కౌన్ హే వో'గా ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. తాజాగా యూట్యూబ్‌లో ఈ పాట 500 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. 2015లో విడుదయిన ఈ సాంగ్ ఇంకా రికార్డులను బ్రేక్ చేయడం ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఒక రీమేక్ పాటకు.. అది కూడా ఒక తెలుగు పాటకు హిందీలో ఇంతగా ఆదరణ రావడం ఇదే మొదటిసారి.

Tags

Read MoreRead Less
Next Story