Jetty: ఆశ కంటే ఆశయం గొప్పది.. బాలకృష్ణ మెచ్చిన 'జెట్టి' ట్రైలర్

Jetty: ఆశ కంటే ఆశయం గొప్పది.. బాలకృష్ణ  మెచ్చిన జెట్టి ట్రైలర్
Jetty:నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jetty: నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "జెట్టి" సినిమా ట్రైలర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన.. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

సినిమా మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత వేణు మాధవ్ మాట్లాడుతూ.. ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమాను నిర్మించాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను చక్కగా చిత్రీకరించారు మా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. త్వరలోనే థియేటర్ లలో "జెట్టి" సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

నా ఆశ కంటే మా నాన్న ఆశయం గొప్పది అని కధానాయిక చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. జెట్టి కోసం రెండు వర్గాల మధ్య సాగే సన్నివేశాలతో దర్శకుడు కధను ఆసక్తికరంగా మలిచాడు.

నటీ నటులు : నందిత శ్వేత‌, మాన్యం కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

సాంకేతిక నిపుణులు : బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్, మ్యూజిక్ : కార్తిక్ కొండ‌కండ్ల‌, నిర్మాత: వేణు మాధ‌వ్, క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: సుబ్రమణ్యం పిచ్చుక


Tags

Read MoreRead Less
Next Story