సినిమా

Unstoppable: భార్యకు ప్రేమతో బాలకృష్ణ.. వసూ.. ఐ లవ్యూ

Unstoppable: నాకు తెలుసు మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు

Unstoppable: భార్యకు ప్రేమతో బాలకృష్ణ.. వసూ.. ఐ లవ్యూ
X

Unstoppable: అఖండ విజయంతో మంచి జోరుమీద ఉన్న బాలకృష్ణ.. అన్‌స్టాపబుల్.. తగ్గేదేలే అంటూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ మీద సైతం తన హవాని కొనసాగిస్తున్నారు. రానా దగ్గుబాటితో ఆయన చేసిన ఛాట్ ఆసక్తికరంగా కొనసాగింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆడియన్స్‌కి బోల్డంత వినోదాన్ని పంచారు.

ఈ క్రమంలోనే రానా.. బాలకష్ణని మీరెప్పుడైనా వసుందరగారికి ఐ లవ్ యూ చెప్పారా అని అడిగాడు.. దానికి బాలకృష్ణ అవన్నీ నీకెందుకయ్యా అని రనతో అన్నారు.. ఏమనుకున్నారో ఏమో వెంటనే శ్రీమతికి ఫోన్ చేసి వసూ.. ఐ లవ్యూ యూ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు.

దానికి ఆవిడ కూడా అటునుంచి నాకు తెలుసు మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు అని వసుంధర సమాధానమిచ్చారు. బాలయ్య కూడా రానా పెళ్లి గురించి చాలానే ప్రశ్నలు సంధించారు. అప్పట్లో పూలరంగడులా తిరిగేవాడివి.. ఎంతమందికి హ్యాండ్ ఇచ్చావో.. ఎంతమందికి నో చెప్పావో గూగుల్ చెప్తుంది అంటూ రానాని ఆట పట్టించారు. ఇదే వేదికపై ఏమంటివి ఏమంటివి అనే భారీ డైలాగ్ చెప్పి బాలకృష్ణని ఆశ్చర్యపరిచాడు రానా.

Next Story

RELATED STORIES