సినిమా

Bhumika Chawla: అక్కడికి వెళ్తేనే.. ఆఫర్లు వస్తాయా! అలా అయితే...

Bhumika Chawla: సెకండ్ ఇన్నింగ్స్‌‌లో నటీ నటులందరూ మళ్లీ దుమ్మురేపుతుంటే భూమిక ఎందుకు కామ్‌గా ఉందని అందరూ అనుకుంటున్నారు.

Bhumika Chawla: అక్కడికి వెళ్తేనే.. ఆఫర్లు వస్తాయా! అలా అయితే...
X

Bhumika Chawla: నాకోసం మేకర్స్ ముంబై వచ్చి..భూమిక ఓ మంచి నటి.. మహేష్ బాబుతో ఒక్కడు, పవన్ కళ్యాణ్‌తో ఖుషి సినిమాల్లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీ మిస్సమ్మలో అయితే భూమిక నటన హైలెట్. ఆ సినిమా ఎన్ని సార్లు టీవీలో వచ్చినా ఇప్పటికి చూడాలనిపిస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్‌నటీ నటులందరూ మళ్లీ దుమ్మురేపుతుంటే భూమిక ఎందుకు కామ్‌గా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఆమె కొంచెం రిజర్వ్‌డ్.. పార్టీలకు, ఫంక్షన్లకు రాదు.. అందుకే ఆమెకు అవకాశాలు రావట్లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అవకాశాలు రావాలంటే ఫిల్మ్ నగర్ చుట్టూ తిరగాలా.. ఆఫర్స్ కోసం అందర్నీ అడగాలా.. అలా అయితేనే ఆఫర్స్ వస్తాయనుకోవడం పొరపాటు..

ప్రతిభ ఉంటే పాత్రలు వాటంతట అవే వస్తాయి. మేకర్స్ నా కోసం ముంబై వచ్చన రోజులు కూడా ఉన్నాయి అని భూమిక తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్‌హీరోయిన్‌గా ఉన్నప్పుడే 2007లో నిర్మాత భరత్ ఠాకూర్ని పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైంది.

అయితే సెకంట్ ఇన్నింగ్స్‌లో అడపా దడపా వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంది. అలా వచ్చిన ఎమ్‌సీఏ, పాగల్, సిటీమార్ సినిమాల్లో ఓకే అనిపించినా మంచి పాత్రలు మాత్రం ఆమెకు రాలేదనే చెప్పాలి.

Next Story

RELATED STORIES