సినిమా

Bigg Boss 5 Telugu: 'అందరి ముందు అలా అనడం బాలేదు'.. తల్లికి సిరి ఆన్సర్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైన ఘట్టం ఫ్యామిలీ వీక్.

Bigg Boss 5 Telugu: అందరి ముందు అలా అనడం బాలేదు.. తల్లికి సిరి ఆన్సర్
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ చాలా ఇష్టమైన ఘట్టం ఫ్యామిలీ వీక్. వందరోజులకు పైగా ఇంటివారికి దూరంగా ఉంటున్న హౌస్‌మేట్స్.. కుటుంబ సభ్యులను కలిసే వారమిది. చూస్తుండగానే బిగ్ బాస్ 5 తెలుగులో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరి కుటుంబ సభ్యులు వచ్చి అందరు హౌస్‌మేట్స్‌ను పలకరించి వెళ్తున్నారు. అందులో సిరి తల్లి రాక ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సిరి, షన్నూ బిగ్ బాస్ రాకముందు నుండి మంచి ఫ్రెండ్స్. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత కూడా వారిద్దరు మామూలుగానే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ మెల్లగా వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు వారిని మరింత దగ్గర చేసాయి. అప్పటినుండి వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అనిపించేలా వీరి ప్రవర్తన మారిపోయింది.

ఫ్యామిలీ వీక్ మొదలయినప్పటి నుండి సిరి, షన్నూ కోసం ఎవరు వస్తారో, ఏం చెప్తారో అని టెన్షన్ పడడం మొదలుపెట్టారు. అనుకున్నట్టుగానే ముందుగా బిగ్ బాస్ హౌస్‌లోకి సిరి వాళ్ల అమ్మ వచ్చారు. రాగానే షన్నూ.. సిరిని బాగా చూసుకుంటున్నాడు అంటూనే ఊరికే హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు అనేశారు. దీంతో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

షన్నూ తనను చాలా కేరింగ్‌గా చూసుకుంటున్నాడని, తనను అందరి ముందు అలా అనడం బాగాలేదని తల్లికి సమాధానం చెప్పింది సిరి. ఒకవేళ తనకు ఏదైనా నచ్చకపోయింటే పక్కకు పిలిచి అడగాల్సిందని, అలా అందరి ముందు అనడం వల్ల షన్నూ ఫీల్ అయ్యింటాడని చెప్పింది. అంతే కాక షన్నూను పిలిచి కాసేపు వారిద్దరు మాట్లాడుకునేలా చేసింది.

Next Story

RELATED STORIES