సినిమా

Bigg Boss 5 Telugu: ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వరకు వెళ్లిన బిగ్ బాస్ షన్నూ క్రేజ్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను ఎంతమంది ఇష్టపడరో.. అంతకంటే ఎక్కువమంది ఇష్టపడతారు కూడా.

shanmukh jaswanth (tv5news.in)
X

shanmukh jaswanth (tv5news.in)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ను ఎంతమంది ఇష్టపడరో.. అంతకంటే ఎక్కువమంది ఇష్టపడతారు కూడా. బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చాలామంది దానికి అభిమానులే. అది రియాలిటీ షోనే అయినా దానిలో లీనమయిపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకే తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా బిగ్ బాస్‌లో యూట్యూబర్ షన్నూ గెలవాలని ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లో బోర్డ్ పట్టుకుని ప్రచారం చేస్తోంది.

క్రికెట్ అనేది కూడా చాలామందికి నచ్చిన ఎంటర్‌టైన్మెంట్. అంతకంటే ఎక్కువగా చాలామందికి ఎమోషన్ కూడా. అయితే ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ ప్లేయర్స్ గెలవాలని బోర్డ్స్ పట్టుకుని విష్ చేస్తుంటారు. ఈమధ్య మరీ వెరైటీగా బోర్డ్స్ రాయడం క్రికెట్ లవర్స్‌కు అలవాటు అయిపోతుంది. తాజాగా అలా ఓ అమ్మాయి బిగ్ బాస్ గురించి బోర్డ్ పట్టుకుని కెమెరాలను తనవైపు తిప్పుకుంది.

యూట్యూబ్‌లో యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న షన్నూ.. బిగ్ బాస్‌లలోకి వచ్చి తన ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకున్నాడు. ఇతర ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ టాప్ 5కి దగ్గరయ్యాడు. ఓట్ల విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఆల్ ది బెస్ట్ షన్నూ అని బోర్డ్ పట్టుకుని మరీ విష్ చేసింది ఓ ఫ్యాన్. ఇది చూసిన షన్నూ ఫ్యాన్స్ మరింత హ్యాపీ అవుతున్నారు.

Next Story

RELATED STORIES