Bigg Boss: వాళ్లు క్లోజే కానీ నా ఓటు ఆమెకే..

Bigg Boss: వాళ్లు క్లోజే కానీ నా ఓటు ఆమెకే..
బిగ్‌బాస్ షో సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఎంటర్‌టైన్ చేస్తుంది. 19 మంది కంటెస్టెంట్లో ఒకే ఇంట్లో చేసే రచ్చ మామూలుగా లేదు.

Bigg Boss 5: బిగ్‌బాస్ షో సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఎంటర్‌టైన్ చేస్తుంది. 19 మంది కంటెస్టెంట్లో ఒకే ఇంట్లో చేసే రచ్చ మామూలుగా లేదు. కోపాలు, తాపాలు, అరుపులు, అలకలు అప్పుడే మొదలయ్యాయి.. ఒకానొక సమయంలో పీక్స్‌కి కూడా చేరుకుంటున్నాయి. యానీ మాస్టర్ అంతగా అరుస్తారా అని షో చూసే బుల్లి తెర ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. బాస్ చెప్పి పంపించాడేమో.. బాగానే అరుస్తున్నారు అనే వాళ్లు కూడా లేకపోలేదు.

వచ్చిన మొదటి రోజు నుంచే వార్ మొదలెట్టేశారు.. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకునే స్టేజ్‌కి వెళ్లి పోయారు. జెస్సీ మీద యానీ మాస్టర్ ఫైర్ అవ్వడం.. ఎందుకంత ఫైర్ అవుతున్నవని కాజల్‌ను లహరి చీవాట్లు పెట్టడం చూస్తుంటే మున్ముందు.. ఈ గొడవలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియా వేదికగా తమకు ఇస్టమైన కంటెస్టెంట్లపై ఎవరైనా కామెంట్లు చేస్తుంటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.



ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్‌బాస్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ రవి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియ, నటరాజ్ మాస్టర్ ఇలా చాలా మంది పాల్గొన్నా.. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌కే నా పూర్తి మద్దతు అని అంటున్నారు.

ప్రియాంక అబ్బాయిగా ఉన్నప్పుడే తనకు బాగా క్లోజ్ అని.. ఎంతో కష్టపడి ఈ స్తాయికి వచ్చాడని అన్నారు. ప్రియాంక బిగ్‌బాస్‌కి వచ్చిందని తెలిసి చాలా సంతోషించానన్నారు. ట్రాన్స్‌జెండర్‌గా మారాక ప్రియాంక చాలా ఇబ్బంది పడిందని, అవకాశాలు రాని సమయంలో తాను ఓ షోలోకి తీసుకుని సాయం చేశానని గుర్తు చేసుకున్నారు.

ప్రియాంక విన్నర్ అవుతుందో లేదో తనకు తెలియదని, కానీ తన పూర్తి మద్దతు ప్రియాంకకే ఇస్తానని తేల్చి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రియాంక అసలు పేరు సాయి తేజ. ఓ కామెడీ షోలో లేడీ గెటప్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ట్రాన్స్‌జెండర్‌గా మారాక ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకుంది.

Tags

Read MoreRead Less
Next Story