సినిమా

Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్ షోతో యాంకర్ రవి ఎంత సంపాదించాడో తెలుసా!!

Bigg Boss Telugu Season 5: బాగా ఆడుతూ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ, జెన్యూన్‌గా ఆడుతున్న రవిని సడెన్‌గా ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపించేస్తారా..

Bigg Boss Telugu Season 5: బిగ్‌బాస్ షోతో యాంకర్ రవి ఎంత సంపాదించాడో తెలుసా!!
X

Bigg Boss Telugu Season 5: అదేంటి.. బిగ్ బాస్ అలా చేశారు.. ముందు టాప్‌ 5లో ఉన్నాడనుకున్నాం.. కానీ బాగా ఆడుతూ, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ, జెన్యూన్‌గా ఆడుతున్న రవిని సడెన్‌గా ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపించేస్తారా.. అసలు మీకిది ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా అని రవి అభిమానులు బిగ్‌బాస్‌ని ఆడిపోసుకుంటున్నారు.

ఎవర్ని హౌస్‌లో ఉంచాలి, ఎవర్ని బయటకు పంపించాలి అని అన్నీ మీరే నిర్ణయించుకున్నప్పుడు మరి ఓటింగ్ ఎందుకు అని ఫైర్ అవుతున్నారు. కాజల్, సిరి, ప్రియాంక కంటే రవికే తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడు హౌస్‌లో కొనసాగాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే బిగ్‌బాస్ అతడిని భరించలేకే బయటకు పంపించేసిందని టాక్.. అంటే అతడికి భారీ రెమ్యునరేషన్.. వారానికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ముట్టజెప్పాల్సి వస్తోందట. దీంతో ఇప్పటికే రూ.90 లక్షలు అతడి అకౌంట్లో పడ్డాయట.. మరి ఇంకా ఉంచుకుంటే విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ రూ.50 లక్షలను ఇప్పటికే బీట్ చేశాడు.

చివరి వరకు ఉంచాలంటే మరి కొన్ని లక్షలు ఇచ్చుకోవాలి. అంత అవసరం లేదని భావించినట్టున్నాడు బిగ్‌బాస్.. అందుకే రవిని బయటకు పంపించేసారని సమాచారం. మరో కథనం ఇప్పటి వరకు బిగ్‌బాస్ ట్రోఫీ పురుషులు మాత్రమే అందుకుంటున్నారు.. మహిళలకు ఏది గౌరవం.. అని లేడీ ఫ్యాన్స్ గొంతెత్తుకోవడంతో ఒక లేడీ కంటెస్ట్‌ను ఫినాలేకు పంపించాలని బిగ్‌బాస్ బలంగా ఫిక్సయినట్లు తెలుస్తోంది. మరి బరిలో ఉన్న ప్రియాంక సింగ్, సిరి, కాజల్ ఆ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Next Story

RELATED STORIES