viral news: ఆప్ ఎంపీతో బాలీవుడ్ బ్యూటీ చెట్టపట్టాల్..

viral news: ఆప్ ఎంపీతో బాలీవుడ్ బ్యూటీ చెట్టపట్టాల్..
viral news: నటీమణులు క్రీడాకారులను, బిజినెస్ మ్యాన్‌లను, పొలిటికల్ లీడర్లను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు..

Bollywood: నటీమణులు క్రీడాకారులను, బిజినెస్ మ్యాన్‌లను, పొలిటికల్ లీడర్లను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు.. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో కలిసి తిరగడం కెమేరా కంటికి చిక్కింది. దాంతో మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తోంది... కానీ అదంతా తూచ్ అని కొట్టి పారేస్తున్నారు రాఘవ్. వాళ్లిద్దరూ కలిసి చేసిన డిన్నర్, లంచ్ మీట్‌ల ఫోటోలు వైరల్ అయ్యాయి. దయచేసి నన్ను రాజకీయాల గురించి ప్రశ్నలు అడగండి. అంతేకానీ పరిణితి గురించి కాదు అని రాఘవ్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం మరింత ఎక్కువయ్యాయి విలేకరులకు. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారేమో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఏది ఏమైనా ఇద్దరి పెయిర్ బావుంది అని పోస్టులు పెడుతున్నారు. నిజానికి, ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. చాలా మంది సాధారణ స్నేహితుల మాదిరిగానే వీరిద్దరూ కూడా ఉన్నారు. అయితే అతడు ఎంపీ కావడంతో కొంత ఆసక్తి నెలకొంది. పరిణీతి, రాఘవ్ ఇద్దరూ ప్రయాణాలను ఇష్టపడతారు. దాంతో కలిసి వెళ్లడానికి మక్కువ చూపుతారు. ఈ విషయంపైనే తరచుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కూడా , తెలుసుకున్నాము. రాఘవ్‌ కేవలం 44 మందిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నాడు. ఇందులో బాలీవుడ్ నుండి ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన గుల్ పనాగ్ అయితే, మరొకరు పరిణీతి చోప్రా.

Tags

Read MoreRead Less
Next Story