Actor Brahmaji: ఆమెకు ఒక బాబు.. అయినా ప్రేమించి పెళ్లి..: బ్రహ్మాజీ

Actor Brahmaji: ఆమెకు ఒక బాబు.. అయినా ప్రేమించి పెళ్లి..: బ్రహ్మాజీ
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.

Actor Brahmaji: సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. టీవీ షోలలో, కార్యక్రమాలలో తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. పలు సంఘటనలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. ప్రస్తుతం సహాయ నటుడిగానే కాక, నెగటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సినీ కెరీర్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్రహ్మాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు.

బ్రహ్మాజీ తూర్పు గోదావరి జిల్లాలో పుట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగారు. తండ్రి తహసీల్దార్. సీనియర్ నటుడు సోమయాజులు గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చేశారు. ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎక్కడకు వెళ్లినా ఆయనకు భారీగా సన్మాన సత్కారాలు జరిగేవి. అది చూసి తాను కూడా సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. అక్కడే కృష్ణవంశీ, రవితేజ, రాజా రవీంద్ర తదితరులతో పరిచయం ఏర్పడింది. గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశం వచ్చి సంతృప్తి చెందిన పాత్రలు లభించలేదు. ఇప్పుడు మళ్లీ మంచి రోజులు వచ్చాయి బ్రహ్మాజీకి. కమెడియన్, సహాయ నటుడు, నెగెటివ్ షేడ్స్ ఉంన్న ప్రాత్రలు వస్తున్నాయి అని తెలిపారు.

తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. తాను ఒక బెంగాలీ అమ్మాయి ప్రేమిచి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమెకు అప్పటికే పెళ్లై ఒక బాబు ఉన్నాడు.. విడాకులు తీపుకుంది. అయినా ఆమెను ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు బ్రహ్మాజీ. ఇదివరకే ఒక బాబు ఉండగా మళ్లీ పిల్లలు ఎందుకని వద్దనుకున్నారు. ఆ అబ్బాయే ఇప్పుడు పిట్టకథ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story