సినిమా

Bandla Ganesh: గుడిలో ఉన్నా సామి: బండ్లన్న ట్వీట్‌కి పవన్ ఫ్యాన్స్ ఫిదా

Bandla Ganesh: గుడిలో ఉన్నా సామి: బండ్లన్న ట్వీట్‌కి పవన్ ఫ్యాన్స్ ఫిదా
X

Bandla Ganesh: బండ్ల గణేష్ ఓ బడా నిర్మాత మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్‌ని అమితంగా ఆరాధించే ఓ వ్యక్తి. ఆయన మైకు పట్టుకుంటే ఆ మాటల ప్రవాహానికి ఆడియన్స్ ఫిదా అవుతారు. ఈసారి ఏం మాట్లాడతాడో అని ప్రేక్షకులు ఎదురు చూసేలా చేయడంలో బండ్లన్న ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. అందుకే పవన్ పుట్టిన రోజు నాడు ఏం చెప్తాడో అని ఆసక్తి ఎదురు చూశారు పవన్ ఫ్యాన్స్. అభిమానులను ఖుషీ చేస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్‌‌ని అందరూ అభిమానిస్తే.. బండ్ల గణేష్ మాత్రం ఆరాధిస్తాడు. పవన్ నా దేవుడు అని చెప్పే బండ్లన్న ఆయన పుట్టిన రోజు నాడు లేటుగా స్పందించడంలో ఆంత్యర్యమేమి గణేషా అని ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆనక బండ్లకు ట్వీట్ చేశారు. నేను గుడిలో ఉన్నాను సామి అని వారికి బదులిచ్చారు.

అయితే లేటుగా చెప్పినా లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు చెప్పారు బండ్ల గణేష్. అందరూ ఊహించినట్టుగానే ఆయనను దేవుడు అని సంబోధిస్తూ.. "మనిషి రూపంలో ఉన్న దేవుడు.. ఐక్యత, బాధ్యత, వాస్తవికత, నాణ్యత, స్వచ్ఛత, పవిత్రత, సమగ్రత, నైతికత ఇలా అన్నీ ఒకే మనిషిలో ఉన్న దేవుడు పవన్ కళ్యాణ్'' అని ట్వీట్ చేశారు.

అవును గుడిలో ఉన్నానని చెప్పారు.. అంటే అది పవన్ ఇల్లు అని మేము అర్థం చేసుకోవచ్చా అని అంటూనే.. ఆయన వందేళ్లు బ్రతకాలని దేవుడికి కుంకుమ బొట్టు పెట్టండి అని ట్వీట్లు చేస్తున్నారు. మరి కొందరు పవన్ పేరు మీద అర్చన చేయిస్తున్నారు కాబోలు అని కామెంట్ చేస్తున్నారు.


Next Story

RELATED STORIES