సినిమా

Mahesh-Namrata: ప్రేమ, పెళ్లికి వయసుతో పనేముంది.. సెలబ్రిటీలు తమ కన్నా పెద్ద వాళ్లను..

Mahesh-Namrata: అన్యోన్య దాంపత్యానికి వయసుతో పనేముంది.. అర్థం చేసుకునే వాళ్లు దొరకితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది..

Mahesh-Namrata: ప్రేమ, పెళ్లికి వయసుతో పనేముంది.. సెలబ్రిటీలు తమ కన్నా పెద్ద వాళ్లను..
X

Mahesh-Namrata: అన్యోన్య దాంపత్యానికి వయసుతో పనేముంది.. అర్థం చేసుకునే వాళ్లు దొరకితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది.. ఎవరో ఏదో అనుకుంటారు అనే వాటికి కాలం చెల్లింది.. ఒకప్పుడంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువగా ఉండాలనే వారు.. కానీ ఈ ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువ వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం అభ్యతరం చూపట్లేదు.. పైగా అవన్నీ ప్రేమ వివాహాలు కూడా కావడం విశేషం. ఇలా సినిమా ఇండస్ట్రీలో తమ కన్నా ఎక్కువ వయసున్న వారిని వివాహం చేసుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న హీరో, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మరి వారిని గురించి తెలుసుకుందాం.

మన తెలుగు ఇండస్ట్రీలో ఓ చక్కటి ప్రేమ జంట.. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత.. వంశీ సినిమా షూటింగ్ లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మహేష్ కంటే నమ్రత రెండున్నరేళ్లు పెద్ద. అయినా వారి ప్రేమకు వయసు అడ్డు రాలేదు.. ఐదేళ్లు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

బాలీవుడ్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా తనకన్నా వయసులో 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్ ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ప్రియాంక కెరీర్ మరింత పుంజుకుంది.



అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యారాయ్ రెండేళ్లు పెద్ద. ప్రస్తుతం వీళ్లిద్దరూ సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు.



కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకున్న సైఫ్ అలీ ఖాన్.. ఆమె కంటే ముందు తన కంటే 13 ఏళ్లు పెద్ద దైన అమృతాసింగ్ ని వివాహం చేసుకున్నాడు.. వీళ్లిద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.. కానీ వీరిది కూడా ప్రేమ వివాహం కావడం విశేషం.

బిపాషా బసు తన కన్నా మూడేళ్లు చిన్నవాడైన కరణ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుంది.

శిల్పాశెట్టి కూడా తన కన్నా చిన్నవాడైన రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

సుస్మితా సేన్ తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్ తో చెట్టా పట్టాలేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

ఇక ఎక్కువగా వార్తల్లో కనిపించే ఫిట్ నెస్ ఫిగర్ మలైక అరోరా.. తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది.. త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు.

కొన్నేళ్లు డేటింగ్ చేసి ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు నేహా దూపియా, అంగద్ బేడి.. నేహ కంటే అంగద్ రెండేళ్లు చిన్నవాడు.

మరి మన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్న అనుష్క శర్మ 6 నెలలు పెద్ద. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరికీ ఈ మధ్యే ఓ చిన్నారి పుట్టింది.

సచిన్ టెండూల్కర్ తన కంటే ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.





Next Story

RELATED STORIES