భోళాశంకర్.. చిరు ఒక్కరే మోశారు..

భోళాశంకర్.. చిరు ఒక్కరే మోశారు..
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి మొదటిసారి నటించిన చిత్రం భోళాశంకర్..

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి మొదటిసారి నటించిన చిత్రం భోళాశంకర్.. ఈ చిత్రం తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' రీమేక్. మెహెర్ మెగాస్టార్‌కి వీరాభిమాని. చాలా కాలం విరామం తర్వాత మెగాఫోన్ పట్టారు మెహర్.. అతని రీ ఎంట్రీ చిరంజీవితో చిత్రం చేయడాన్ని గొప్ప అవకాశంగా భావించారు. మరి మెహర్ తన ప్రయత్నంలో ఎంత వరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం.

సినిమా కథేంటి..

మహిళల అక్రమ రవాణాతో సినిమా మొదలవుతుంది. శంకర్ (చిరంజీవి) తన సోదరి మహా (కీర్తి సురేష్) చదువు కోసం కోల్‌కతాకు వస్తాడు. ఆమెను కాలేజీలో చేర్పించిన తర్వాత, జీవనోపాధి కోసం శంకర్ టాక్సీ డ్రైవర్‌గా మారతాడు. మహిళల అక్రమ రవాణా నేరాలలో కలకత్తా పోలీసులు టాక్సీ డ్రైవర్ల సహాయాన్ని కోరతారు. శంకర్ ఒక కీలకమైన క్లూ వారికి ఇస్తాడు. అది అతనిని ఇబ్బందుల్లోకి నెడుతుంది.

ఇదిలా ఉంటే లాస్య (తమన్నా) సోదరుడు శ్రీఖర్ (సుశాంత్) మహా (కీర్తి)ని ప్రేమిస్తాడు. శంకర్ కి కూడా తన చెల్లెలు శ్రీకర్ ని చేసుకోవడానికి ఇష్టపడతాడు. అయితే, లాయర్ అయిన లాస్య శంకర్ దాచిన కార్యకలాపాలు,అతడు చేసిన హత్యల గురించి తెలుసుకుంటుంది. ఆమె మహాతో తన సోదరుడి పెళ్లిని ఆపాలని నిర్ణయించుకుంటుంది. శంకర్ తన గతాన్ని, కోల్‌కతాకు రావడం వెనుక ఉన్న తన ఉద్దేశ్యాన్ని ఆమెకు వెల్లడిస్తాడు. మహిళల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను అతను ఎలా పట్టుకున్నాడు అనేది ప్రధానాంశం.

చిరంజీవి తన నటన మరియు గ్రేస్‌తో చిత్రాన్ని నిలబెట్టాడు. అతని డ్యాన్సులు, మేనరిజమ్స్ ప్రేక్షకుల్ని కొంత సమయం ఎంగేజ్ చేస్తాయి. సోదరి పాత్రలో కీర్తి సురేష్ పర్వాలేదనిపించింది. ఆమెకు నటించడానికి తగినన్ని సన్నివేశాలు లేవు. తమన్నా తెరపై బబ్లీగా కనిపిస్తోంది. ఆమెకు మాత్రం నటించడానికి ఎక్కువ స్కోప్ లేదు. కానీ చిరుతో ఆమె చేసిన డ్యాన్సులు మాత్రం కళ్లు చెదిరేలా ఉన్నాయి. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, శ్రీముఖి సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకునేలా లేవు. విలన్‌లు కూడా తెరపై విఫలమయ్యారు. ఈ సినిమాలో ఇతర తారాగణం ఎవరికీ ప్రాముఖ్యత లేదు.

సాంకేతికతలు :

రీమేక్‌ల నిర్వహణలో మరింత నైపుణ్యం అవసరం అని ఈ చిత్రం మరోసారి దర్శకులకు చెబుతుంది. చిరు డ్యాన్స్ కారణంగా రెండు పాటలు చూడ్డానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ నిరాశపరిచింది.

భోళా శంకర్‌కి ఒకే ఒక ప్లస్ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాను తన భుజాలకు ఎత్తుకుని నడిపించారు. అతని డ్యాన్స్ మూమెంట్స్ అదిరాయి. ఈ వయసులో ఇలాంటి డ్యాన్స్ మూమెంట్స్ అందించడం అంత సులువు కాదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే కామెడీ సీక్వెన్స్‌లో కూడా కమెడియన్ల గ్యాంగ్‌తో పాటు హాస్యం పుట్టిస్తూ చిరు తనదైన ముద్ర వేశారు.

Tags

Read MoreRead Less
Next Story