సినిమా

Mega Star Chiranjeevi: అల్లుడికి మామ ఆల్‌ ది బెస్ట్.. చిరు ట్వీట్..

Mega Star Chiranjeevi: మీ రక్తాన్ని, మీ చెమటను ధారపోసి చిత్రం కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు..

Mega Star Chiranjeevi: అల్లుడికి మామ ఆల్‌ ది బెస్ట్.. చిరు ట్వీట్..
X

Mega Star Chiranjeevi: రిలీజ్‌కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. రేపు విడుదలవబోతున్న ఈ చిత్రానికి ప్రముఖులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా పుష్ప టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీరు పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది.. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మీ రక్తాన్ని, మీ చెమటను ధారపోసి చిత్రం కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు.. పుష్ప చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కాగా రిలీజ్‌కి ఇంకా ఒక్క రోజే ఉండడంతో ప్రమోషన్లు వేగవంతం చేసిన యూనిట్ నిన్న బెంగళూరులో ప్రెస్ మీట పెట్టింది. అల్లు అర్జున్, రష్మిక చిత్ర ప్రమోషన్స్‌కి సంబంధించిన ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలన్నీ మిలియన్ల వ్యూస్‌ని అందిస్తున్నాయి.

సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయడంతో చిత్రం మరిన్ని అంచనాలు పెరిగాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం పుష్పను అభిమానులు ఆదరిస్తారని పుష్ప టీమ్ ఆశిస్తోంది. 'పుష్ప' ఐదు భాషల్లో 3,000 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Next Story

RELATED STORIES