Babu Mohan: ఆ బాధతో చనిపోవాలనుకున్నా: బాబూ మోహన్

Babu Mohan: ఆ బాధతో చనిపోవాలనుకున్నా: బాబూ మోహన్
Babu Mohan: నవ్వులు పూయించే నటుల జీవితాల్లో ఇంతటి విషాదం దాగుంది.

Babu Mohan: రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం.. సాఫీగా సాగిపోతున్న జీవితం. అయినా సినిమాలపై ఆసక్తి.. నీ ఫేస్ చూసి అవకాశాలు ఎవరిస్తారని హేళన చేసిన వాళ్లు ఉన్నాయి.. అయినా అదే అతడికి ఇండస్ట్రీలో కలిసొచ్చిన అంశం. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అన్నీ కలిసి వెనక్కి తిరిగి చూసుకోనివ్వకుండా చేశాయి.. తనదైన మ్యానరిజంతో బాబూ మోహన్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

అప్పట్లో బాబూ మోహన్, కోటా శ్రీనివాస రావు ఉంటే సినిమా ప్రియులకు పండగే.. పొట్ట చెక్కలయ్యేలా కామెడీని పండించేవారు.. ఇద్దరి జోడీలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లు. బాబూ మోహన్‌ని దృష్టిలో పెట్టుకునే దర్శకులు కొన్ని సీన్లు రాసేవారంటే అతడికి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం అవుతుంది. కృష్ణారెడ్డి దర్శకత్వంలో హీరోగానూ నటించి ప్రేక్షకులను అలరించాడు.


సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేశాడు. కానీ గత కొంత కాలంగా రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు బాబూ మోహన్. తాజాగా ఓ షోలో పాల్గొన్న బాబూ మోహన్ తన ఏకైక కుమారుడి మరణంతో కృంగి పోయానని అన్నారు.

బాధతో అస్థిపంజరంలా మారిపోయానని అన్నారు. ఒకానొక క్షణంలో చనిపోవాలనుకున్నానని అన్నారు. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నానని అన్నారు. బాబూ మోహన్ ఒక్కగానొక్క కొడుకు రోడ్ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.. అనూహ్యంగా కోటా శ్రీనివాసరావు కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. నవ్వులు పూయించే నటుల జీవితాల్లో ఇంతటి విషాదం దాగుంది.

Tags

Read MoreRead Less
Next Story