సినిమా

cvl narasimharao comments on maa elections: మా ఎన్నికలు.. విత్ డ్రా చేసుకుంటే మంచిది: సీవిఎల్ సంచలన వ్యాఖ్యలు

cvl narasimharao comments on maa elections: మరో నాలుగు రోజుల్లో జరగబోయే మా ఎలక్షన్స్‌లో ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

cvl narasimharao comments on maa elections: మా ఎన్నికలు.. విత్ డ్రా చేసుకుంటే మంచిది: సీవిఎల్ సంచలన వ్యాఖ్యలు
X

cvl narasimharao comments on maa elections: మరో నాలుగు రోజుల్లో జరగబోయే మా ఎలక్షన్స్‌లో ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీలో బరిలోకి దిగిన బండ్ల గణేష్, సీవీఎల్ వంటి వాటు అనూహ్యంగా నామినేషన్స్ నుంచి తప్పుకున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా నటుడు సీవీఎల్ మా ఎన్నికలపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో సీవీఎల్ మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. ఈ ఎన్నికల్లో మీరు తెలంగాణ బిడ్డలందరినీ దయచేసి గెలిపించండి.

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బాబు మోహన్ గారిని, జాయింట్ సెక్రటరీగా ఉన్న ఉత్తేజ్‌ను, రెండు ప్యాన్లలో ఉన్న తెలంగాణ సభ్యులను గెలిపించండి. తెలంగాణ బిడ్డలు ఓడిపోవడం మంచిది కాదు. దేశమన్నా, దేవుడన్నా, ధర్మమన్నా, చులకన భావం ఉన్న ప్రకాష్ రాజ్‌ని ఓడించండి. అతడికి.. నేను నేను తప్ప మరో విషయం పట్టదు.

అసలు ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే బావుండేది. విత్ డ్రా చేసుకుంటాడని భావిస్తున్న అని సీవీఎల్ వీడియోలో చెప్పుకొచ్చారు.

Next Story

RELATED STORIES