సినిమా

Deepavali Special Movies: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు..

Deepavali Special Movies: వరుస పండగలు.. వారానికో కొత్త సినిమా.. కోవిడ్ అనంతరం థియేటర్లలో కోలాహలం మొదలైంది..

Deepavali Special Movies: దీపావళికి థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు..
X

Deepavali Special Movies: వరుస పండగలు.. వారానికో కొత్త సినిమా.. కోవిడ్ అనంతరం థియేటర్లలో కోలాహలం మొదలైంది.. ప్రతి వారం కొత్త సినిమాలు వెండితెరపై సందడి చేస్తున్నాయి. ఓటీటీలు, థియేటర్లు పోటీ పడుతూ సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా దీపావళికి ప్రముఖ హీరోలు నటించిన కొన్ని చిత్రాలు అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీల్లోనూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

భాషతో పనేముంది.. నా రూటే సెపరేటు.. ఏ భాషలో విడుదలైనా థియేటర్లు దద్ధరిల్లాల్సిందే.. తమిళ్ స్టార్ హీరో రజనీ కాంత్ సినిమా వస్తుందంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుడికీ ఆసక్తి. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం అన్నాత్తేని తెలుగులో పెద్దన్నగా వస్తోంది. ఈ చిత్రం నవంబర్ 4 దీపావళి కానుకగా విడుదలవుతోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ వంటి భారీ తారాగణమే ఈ చిత్రంలో ఉంది. సిస్టర్ సెంటిమెంట్ కథాంశం.

మరో తమిళ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి.. మరో హీరో ఆర్యతో కలిసి నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా నవంబర్ న విడుదల అవుతోంది. పూర్తి యాక్షన్ చిత్రంగా రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో మిత్రులుగా ఉన్న విశాల్, ఆర్యలు ఎందుకు శత్రువులగా మారాల్సి వచ్చింది. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు.

ఇక తెలుగు చిత్రాల విషయానికి వస్తే దర్శకుడు మారుతి తెరకెక్కించిన మంచి రోజులు వచ్చాయి చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించారు. అనూప్ రూబెన్ సంగీత సారథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ సూర్యవంశీ. పోలీస్ కథ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్కు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. గత ఏడాదే విడుదల కావలసింది కరోనా/లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు నవంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

క్లోవీజాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ ఇటర్నల్స్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థావోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు అనేది చిత్ర కథాంశం.

తమిళ నటుడు సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి జ్ఞానవేల్‌ దర్శకుడు. ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందించారు. లా అనేది ఓ శక్తివంతమైన ఆయుధం. ఎవర్ని కాపాడడం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామనేది ముఖ్యం అని ట్రైలర్లో సూర్య పలికిన సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం గల్లీ రౌడీ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ లో నవంబర్ 4న విడుదల కానుంది. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే థియేటర్లలో విడుదలై సందడి చేసిన శ్రీదేవి సోడా సెంటర్ నవంబర్ 5న ఓటీటీ జీ5లో పలకరించనుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన ఈ చిత్రాన్ని పలాస 1978 ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు, శ్రీదేవి పాత్రలో ఆనంది ఒదిగిపోయారు.


Next Story

RELATED STORIES