సినిమా

Shannu Deepthi: మార్పు కోరుకుంటున్న దీప్తి సునైనా.. దీనిపై షణ్నూ రియాక్షన్..?

Shannu Deepthi: షణ్నూ, సిరి.. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ప్రవర్తించిన తీరు మాత్రం అంతకు మించే ఉంది.

Shannu Deepthi (tv5news.in)
X

Shannu Deepthi (tv5news.in)

Shannu Deepthi: బిగ్ బాస్ హౌస్‌ అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్లు, వాచ్‌లు ఏవీ లేకుండా దాదాపు 100 రోజులకు పైనే జీవించడం.. అయితే ఈ ప్రయాణంలో చాలామంది ఒకరికి ఒకరు దగ్గరవుతారు. అలా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఓ ప్రేమజంట ఉంది. చాలావరకు ఈ పరిచయాలు, ప్రేమలు అనేవి బిగ్ బాస్ హౌస్ వరకే పరిమితమయ్యాయి. కానీ వాటి వల్ల వారి వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం యూట్యూబర్ షణ్నూ పరిస్థితి కూడా అలాగే ఉంది.

యూట్యూబర్స్ షణ్నూ, దీప్తి సునైనా ఎప్పటినుండో రిలేషన్‌షిప్‌లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి పర్సనల్ విషయాలు ఇంతకు ముందు పెద్దగా బయటికి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు.. వీరిద్దరి మధ్య ఏ గొడవ జరిగిన ముందుగా దానిని నెటిజన్లతోనే పంచుకుంటున్నారు. వీరి సోషల్ మీడియా పోస్ట్‌లలో వచ్చిన మార్పులు చూస్తే చాలు.. వీరి మధ్య ఏదో గొడవ జరిగిందని చెప్పేయడానికి.


బిగ్ బాస్ సీజన్ 2లో ముందుగా దీప్తి సునైనా కంటెస్టెంట్‌గా ఎంపికయ్యింది. ఆ హౌస్‌లో ఉన్న పరిస్థితులు, బయటికి వచ్చిన తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్స్‌ను చూసి తట్టుకోలేక.. అప్పుడు కూడా షణ్నూను కొన్నిరోజులు దూరంగా పెట్టింది. ఇప్పుడిప్పుడే వీరిద్దరు మళ్లీ కలిసి కనిపిస్తున్నారు. ఇంతలోనే షణ్నూను కూడా బిగ్ బాస్ ఆఫర్ వరించింది.


బిగ్ బాస్ 5లో పెద్దగా ప్రేమజంటలు ఎవరూ లేరు. కానీ షణ్నూ, సిరి.. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ప్రవర్తించిన తీరు మాత్రం అంతకు మించే ఉంది. వీరిద్దరు బయట వేర్వేరు వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా.. హౌస్‌లో వారు అలా ప్రవర్తించడం చాలామందికి నచ్చలేదు. అందుకే దీప్తి సునైనా కూడా షణ్నూతో బ్రేకప్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే షణ్నూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి దీప్తి తనను కలవలేదు. అంతే కాకుండా ఇటీవల దీప్తి తనపై కోపంగా ఉందని షణ్నూనే స్వయంగా వెల్లడించాడు. తాజాగా దీప్తి పెట్టిన పోస్ట్ చూస్తుంటే తనకు షణ్నూపై కోపం ఇంకా తగ్గలేదని స్పష్టమవుతోంది. 'మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ తప్పదు' అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది దీప్తి. దీనికి షణ్నూ ఎలా రియాక్ట్ అవుతాడో అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

Next Story

RELATED STORIES