సినిమా

Bigg Boss 5 Telugu: నా సపోర్ట్ అతడికే అంటున్న దీప్తి సునైనా.. మరి షన్నూ పరిస్థితి..?

Bigg Boss 5 Telugu: దీప్తి.. షన్నూకు మాత్రమే కాకుండా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తోంది.

Bigg Boss 5 Telugu: నా సపోర్ట్ అతడికే అంటున్న దీప్తి సునైనా.. మరి షన్నూ పరిస్థితి..?
X

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ ఎంత కష్టపడి ఆడతారో.. బయట వారికి సపోర్ట్ తీసుకుని రావడం కోసం వారి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కూడా అంతే కష్టపడతారు. లోపల హౌస్‌మేట్స్ చేసిన ఏదైనా పనికి వారిపై నెగిటివిటీ ఏర్పడినా.. బయట ఉన్నవారు దానిని సమర్ధించే ప్రయత్నం చేస్తూ సపోర్ట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. షన్నూ విషయంలో కూడా అదే జరుగుతోంది. షన్నూ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ అందరు తనను ఎలాగైనా టాప్ 5కు పంపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

షన్నూను బయట ఉన్న పెద్ద సపోర్ట్ దీప్తి సునైనా. బిగ్ బాస్‌కు రాకముందు నుండి వీరిద్దరు యూట్యూబ్ స్టార్స్.. అంతే కాదు చాలామందికి ఫేవరెట్ కపుల్ కూడా. అయితే ఇప్పుడు షన్నూ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాడు. దీప్తి సునైనా బయట ఉంది. అందుకే షన్నూను గెలిపించాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ దీప్తిపైనే ఉంది. కానీ దీప్తి.. షన్నూకు మాత్రమే కాకుండా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేయాలంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి ప్రారంభమయ్యింది. ప్రస్తుతం తెలుగు లాగానే తమిళంలో కూడా 5వ సీజన్ నడుస్తోంది. అందులో వరుణ్ అనే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాకుండా ఇప్పుడిప్పుడే హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే అతడికి ఓటు వేయాలంటూ దీప్తి సునైనా ఇటీవల తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను రిక్వెస్ట్ చేసింది.


బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఇష్టమున్న వారు భాషతో సంబంధం లేకుండా దీనిని ఫోలో అవుతూ ఉంటారు. దీప్తి సునైనా కూడా అదే కోవకు చెందిందని తన ఫాలోవర్స్‌ అనుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళ బిగ్ బాస్‌ను ఫాలో అయ్యేవారు ఎవరైనా ఉంటే దీప్తి.. వరుణ్‌కే ఎందుకు సపోర్ట్ చేస్తోంది అన్న విషయం అర్థమవుతుందేమో..

Next Story

RELATED STORIES