Devara : 'దేవర' కిరాక్ అప్ డేట్.. ఎన్టీఆర్ పక్కన శృతి మరాటే

Devara : దేవర కిరాక్ అప్ డేట్.. ఎన్టీఆర్ పక్కన శృతి మరాటే

దేవర (Devara) సినిమా అప్ డేట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ వెర్రెక్కిపోతున్నారు. ఎప్పుడైతే గ్లింప్స్ రిలీజ్ అయిందో అప్పటినుంచి దేవర పేరెత్తితో ఓ వైబ్రేషన్ వస్తోంది ఫ్యాన్స్ కి. దీంతో.. మూవీ పేరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తోంది దేవర. దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ సినిమాతోనే. ఫస్ట్ లుక్ లోనే ఇంప్రెస్ చేసింది జాన్వీ. ఈ సినిమా గురించి రీసెంట్ గా మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఓ మరాఠీ నటి కూడా ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని ట్రెండింగ్ న్యూస్ ను బట్టి తెలుస్తోంది. దేవర’లో హీరో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేస్తున్నారని టాక్. అందుకే ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story