సినిమా

Dhanush: టాలీవుడ్‌లోకి 'సార్' ఎంట్రీ..

Dhanush: టైటిల్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.

Dhanush: టాలీవుడ్‌లోకి సార్ ఎంట్రీ..
X

Dhanush: తమిళ నటుడు ధనుష్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతడికి ఇది మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం. ఈ చిత్రానికి 'సార్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళంలో 'వాతి' పేరుతో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

తొలిప్రేమ, రంగ్ దే వంటి సూపర్ హిట్ మూవీస్ అందించిన వెంకీ అట్లూరి 'సార్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.

విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రంగా 'సార్' తెరకెక్కుతోంది. ఇది సామాన్యుడి ప్రతిష్టాత్మక ప్రయాణం అని నిర్మాతలు చెబుతున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్నారు. మరికొన్ని ముఖ్య పాత్రల్లో సాయి కుమార్, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2022 ప్రారంభంలో ప్రారంభమవుతుంది.

Next Story

RELATED STORIES