సినిమా

Silk Smitha: సిల్క్ స్మిత జీవితంలో అన్నపూర్ణ.. ఆత్మహత్య చేసుకున్న రోజు ఆమె ఎక్కడ?

Silk Smitha: 36 ఏళ్లకే జీవితాన్ని బలవంతంగా ముగించుకున్న సిల్క్ జీవితం అందమైన పూల పాన్పు కాదు. అదో ముళ్ల పాన్పు..

Silk Smitha: సిల్క్ స్మిత జీవితంలో అన్నపూర్ణ.. ఆత్మహత్య చేసుకున్న రోజు ఆమె ఎక్కడ?
X

Silk Smitha: సినిమా నటుల గురించి, సినిమా జీవితం గురించి ఓ సినీ కవి రాసిన వాఖ్యాలు అక్షరాల నిజమనిపిస్తాయి దివంగత నటి సిల్క్ స్మిత జీవితాన్ని పరికిస్తే.. అందమైన లోకమని.. రంగురంగులుంటాయని అందరూ అనుకుంటారు చెల్లెమ్మా.. అది అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా అని తారల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు రచయిత ఆ పాటలో. 36 ఏళ్లకే జీవితాన్ని బలవంతంగా ముగించుకున్న సిల్క్ జీవితం అందమైన పూల పాన్పు కాదు.

అదో ముళ్ల పాన్పు.. అందులో ఇమడలేకపోయింది.. అర్ధాంతరంగా తనువు చాలించింది. డబ్బుకోసమే సినిమాల్లో నటించినా.. ఆ డబ్బు సంతోషాన్నివ్వలేదని తెలుసుకుంది. మానసిక వేదనతో కృంగిపోయింది.. అమ్మలా ఆదరించిన పెద్దమ్మ అన్నపూర్ణ చెప్పినా వినిపించుకోలేదు.. అందర్నీ నమ్మింది.. అన్నీ పోగొట్టుకుంది. చివరికి మరణమే శరణ్యమనుకుని అన్నపూర్ణమ్మను ఊరు పంపించి అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి చనిపోయింది.

పల్లెటూరులో పుట్టి పెరిగింది. చదువుకోలేదు.. అయినా సినిమాల్లో నటించాలనే కోరికతో పెద్దమ్మతో కలిసి చెన్నై రైలెక్కింది విజయలక్ష్మి. అక్కడ ఓ ప్రముఖ నటీమణికి మేకప్ ఆర్టిస్ట్‌గా చేసేందుకు పని దొరికింది.. అక్కడి నుంచే తన సినీ ప్రస్థానం మొదలైంది. తమిళ సినిమాలో నటించేందుకు ఓ డైరెక్టర్ ఆమె పేరును సిల్క్ స్మితగా మార్చారు.నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.. వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. డబ్బు, పేరు, పలుకుబడి అన్నీ వచ్చాయి. వాటితో పాటే చుట్టూ మోసగాళ్లు, ప్రేమ పేరుతో వాడుకునే వాళ్లు ఇండస్ట్రీలో కొదవలేదు. అవకాశాల కోసం అన్నీ చేసింది. అన్నీ తెలిసినా అన్నపూర్ణమ్మ ఏమీ చేయలేకపోయింది. డబ్బుతో పాటే చిన్న ఇల్లు కాస్తా బంగ్లా అయింది.

ఒక్కోసారి స్మిత.. పెద్దమ్మ మీద అరిచినా ఆమె పల్లెత్తు మాట అనేది కాదు. ఆఖరి పెళ్లై భార్యా పిల్లలున్న అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా నోరు మెదపలేకపోయింది ఆమె. మొదట్లో స్మితకు సంబంధించిన అన్ని విషయాలను ఆమె చూసుకునేది. కానీ రాను రాను ప్రేమ పేరుతో సిల్క్ పంచన చేరిన వ్యక్తి అధికారాలన్ని ఆమె నుండి లాగేసుకున్నాడు. ఆ విషయం సిల్క్ గుర్తించలేకపోయింది. అతడి మాయలోపడి అన్నపూర్ణమ్మ చెప్పే విషయాలేవీ తలకెక్కేవి కావు సిల్క్ స్మితకి.

చివరికి తన మీదే పెత్తనం చేసి సిల్క్ జీవితాన్ని నాశనం చేశాడు. చేసిన తప్పు తెలుసుకుని అన్నపూర్ణమ్మ ఒళ్లో తల పెట్టుకుని ఏడ్చేది సిల్క్. మానసికంగా కృంగిపోయిన సిల్క్ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్న మరుక్షణం అన్నపూర్ణమ్మని ఊరికి వెళ్లి రమ్మని పంపించింది. ఆమె వెళ్లిన వెంటనే ఇంట్లో ఒంటరిగా ఉన్న సిల్క్ ఆత్మహత్యకు పాల్పడింది. సిల్క్ జీవితంలో ఎవరికీ తెలియని ఆత్మబంధువు అన్నపూర్ణమ్మ. సిల్క్ స్మిత మరణించన రోజు ఆమె డెడ్ బాడీ పక్కన ఉన్న ఒకే ఒక వ్యక్తి అన్నపూర్ణమ్మ.

Next Story

RELATED STORIES