Director Bapu Birthday Special: గీతకీ రాతకీ వయ్యారాలు నేర్పిన బాపు పుట్టిన రోజు నేడు..

Director Bapu Birthday Special: గీతకీ రాతకీ వయ్యారాలు నేర్పిన బాపు పుట్టిన రోజు నేడు..
Director Bapu Birthday Special: అచ్చతెనుగు సినిమా కేరాఫ్ అడ్రస్ సత్తిరాజు లక్ష్మీనారాయణ అలియాస్ బాపు. అరమరికలు లేని స్నేహానికి చిరునామా బాపు.

Director Bapu Birthday Special: అచ్చతెనుగు సినిమా కేరాఫ్ అడ్రస్ సత్తిరాజు లక్ష్మీనారాయణ అలియాస్ బాపు. అరమరికలు లేని స్నేహానికి చిరునామా బాపు. సిల్వర్ స్క్రీన్ పై తెలుగు ధనాన్ని, కాన్వాస్ పై కొంటెదనాన్ని కలిపి గీసి, తీసిన చిత్రకారుడు బాపు. బాపు తెలుగు వారి ఆస్తి. ఆయన నిర్మించిన అపురూప కళాసంపద లో ఆయనెప్పుడూ జీవిస్తూనే ఉంటారు. ఈ కొంటె చిత్రకారుడి జయంతి నేడు. ఈ సందర్భంగా.. నేటి ఫేవరెట్ ఫైవ్ లో బాపు సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.




తెలుగువారు గర్వించే గీత చిత్ర కారుడు బాపు. గీతకీ రాతకీ వయ్యారాలు నేర్పిన బాపుని వాళ్ల నాన్నగారు లాయర్ గా చూద్దామని లా చదివించారు. కానీ ఎన్నడూ కోర్టు మెట్లు ఎక్కలేదు. తన సినిమాల్లో మాత్రం అప్పుడప్పుడూ కోర్టు సీనులు పెట్టారు. బాపు కార్టూన్లు వేసి మనలోని వెర్రిని వెక్కిరించారు. ఒరే మీరిలా ఉన్నార్రా అని చెప్పారు. ఆనక సినిమాలూ తీశారు. తెలుగోళ్లం ఇలా ఉండాలని కూడా చెప్పారు.

ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసిన ముళ్లపూడి వెంకట రమణ సినిమా పరిశ్రమలోకి వెళ్లాడు. రక్తసంబంధం, మూగమనసులు, దాగుడు మూతలు అంటూ చాలా హిట్ సినిమాలకు కథ, మాటలు రాస్తున్నారు. అలాంటి ఆయనకు నిర్మాతగా మారాలన్న ఆలోచన కలిగింది. వెంటనే ఆ ఆలోచనను అమలు పరిచాడు. తనే రాసిన ఓ కధను తెరకెక్కించేడానికి రెడీ అయిపోయి తన నేస్తం బాపుని డైరక్టరు కుర్చీలో కూర్చోబెట్టేశాడు. వాళ్లిద్దరూ కలిసి తీసిన మొదటి సినిమా సాక్షి.

బాపుకి మొదటి నుంచి రాముడంటే భక్తి. ఎంత భక్తి అంటే...ఓ సారి బెజవాడ అరుణా పబ్లిషింగ్ కంపెనీ వారు రామాయణ విషవృక్షానికి బొమ్మేయమని చెక్కు పంపారు. బాపు గారు...ఆ చెక్కుమీద శ్రీరామ అని రాసి తిప్పిపంపారు. ఆ తర్వాత ఆ కంపెనీకి బొమ్మలు వేయలేదు. ఇచ్చినా రాముడే.. తీసుకున్నా రాముడే అని నమ్మడం చేత అలాంటివి పెద్దగా పట్టించుకునేవాడు కాదాయన. జైఆంధ్ర గొడవల్లో పడి బాపు తీసిన అందాల రాముడ్ని తెలుగోళ్లు నిర్లక్షం చేసినప్పుడూ పెద్దగా ఫీలవలేదు బాపు.



బాపు నుంచి వచ్చిన మరో గొప్ప సినిమా ముత్యాల ముగ్గు. అదీ రామాయణమే. మనిషిలోని మంచికీ చెడుకీ జరిగే పోరాటమే రామరావణ యుద్దం. మంచే గెలుస్తుందనే భరోసా కలిగించి ముందడుగు వేయించడమే రామాయణ లక్ష్యం. దాన్ని తన సినిమాలో చూపించాడు బాపు. మనిషిలో వెర్రితలలు వేస్తున్న దుర్మార్గాలను ఓ కాంట్రాక్టర్ పాత్రలో చూపెట్టి...భయపెట్టారు. మాడా వెంకటేశ్వర్రావు, రావుగోపాల్రావుల మధ్య వచ్చే సీను మరచిపోవడం సాధ్యమయ్యే పనేనా?


ఎప్పుడో చూసిన హిందీ దోస్తీ సినిమాను ఎలాగైనా తెలుగులో తీయాలనుకున్నారు బాపు రమణలు. మొత్తానికి ఆ సినిమాను స్నేహంగా చేశారు. సినిమా తీశారు. ఒరిజినల్ దోస్తీ నుంచి ఒక్క పాట కూడా వాడుకోలేదు. అన్నీ రాయించుకున్నారు... మహదేవన్ తో ఫ్రెష్ గా ట్యూను కట్టించుకున్నారు. పోనీరా పోనీరా పోతే పోనీరా..పోయింది పొల్లు...మిగిలిందే చాలు లాంటి పాటలతో జీవన సత్యాలను ఆవిష్కరించారు.

Tags

Read MoreRead Less
Next Story