Rashmika : ఏప్రిల్ 5 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా : రష్మిక

Rashmika : ఏప్రిల్ 5 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా  :  రష్మిక

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 05న ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ట్రైలర్ పై టాలీవుడ్ బ్యూటీ రష్మిక ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఫ్యామిలీ స్టార్ చాలా బాగుందని రాసుకొచ్చింది. తనకు చాలా ఇష్టమైన విజయ్ దేవరకొండ, పరశురామ్.. ‘ఫ్యామిలీ స్టార్' తో విజయం సాధించాలనికోరుకుంటున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 5 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. మీరు తప్పకుండా హిట్ కొడతారు. హిట్ కొట్టిన తర్వాత నాకు పార్టీ కావాలి. అంటూ రష్మిక పోస్ట్ చేసింది. దీనికి విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ రిప్లే ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story