Flight Accident: 27 ఏళ్ల క్రితం ఘటన.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ అదే ఫ్లైట్‌లో..

Flight Accident: 27 ఏళ్ల క్రితం ఘటన.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ అదే ఫ్లైట్‌లో..
Flight Accident: కొన్ని సంఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నా గుర్తొచ్చిన ప్రతిసారీ గుండె బరువెక్కుతుంది..

Flight Accident: కొన్ని సంఘటనలు జరిగి ఏళ్లు గడుస్తున్నా గుర్తొచ్చిన ప్రతిసారీ గుండె బరువెక్కుతుంది.. మృత్యువు మన నీడలా వెన్నంటే ఉందన్న నిజాన్ని జీర్ణించుకోలేం. ఒక్కోసారి ఆ మృత్యువు బారిన పడకుండా దేవుడు రూపంలోని మనుషులు అడ్డు వేస్తారేమో.. అందుకే 27 ఏళ్ల క్రితం జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ భయానక క్షణాలు గుర్తొచ్చిన ప్రతిసారి గుండె బరువెక్కుతుంది స్టార్ హీరోలతో పాటు అందులో ప్రయాణిస్తున్న 272 మంది ప్రయాణీకులకు.

ఈ సంఘటన జరిగింది 1993లో.. నవంబర్ 15 న మద్రాస్ ఎయిర్ పోర్ట్ నుండి 272 మంది ప్రయాణీకులతో ఉదయం ఆరుగంటలకు హైదరాబాద్ బయలుదేరింది. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ కుటుంబ సభ్యులు, అల్లు రామలింగయ్య దంపతులు, విజయశాంతి, మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్, దర్శకులు బాపు, కోడిరామకృష్ణ, రచయితలు వెంకటేశ్వరరావు, ఇండస్ట్రీకి చెందిన మరి కొంత మంది ప్రముఖులు అందులో ఉన్నారు. విమానంలో ఎక్కువ మంది సినిమా ఫీల్డ్‌కు చెందిన వారు కావడంతో సందడి వాతావరణం నెలకొంది.

విమానం బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోగానే ప్రయాణీకులు దిగడానికి సిద్దమవుతున్నారు. అయితే మంచు కారణంగా రన్ వే కనిపించడం లేదని తిరిగి మద్రాస్ వెళుతున్నట్లు ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసింది. కానీ ఇంతలోనే కో పైలెట్ టెన్షన్‌గా ఎయిర్ హోస్టెస్‌తో మాట్లాడడాన్ని చిరంజీవి గమనించారు.

ఏమైందని ప్రశ్నించగా విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని చెప్పారు. విమానం రెక్కల విషయంలో సమస్య రావడం, మద్రాస్ వెళ్లడానికి తగినంత ఇంధనం లేకపోవడంతో విమానం తిరుపతికి వెళ్లడం లేదని అర్థమయింది. ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్‌‌తో ఉన్నారు.

కాక్ పిట్‌లో సీనియర్ పైలెట్ కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్ రాజ్ ఉన్నారు. రాబోతున్న పరిస్థితిని అంచనా వేసిన కెప్టెన్ భల్లా వెంటనే ఎమర్జెన్సీ లాండింగ్ అనౌన్స్ చేశారు. నెల్లూరు జిల్లా వేంకటగిరికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరి పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ వేగానికి విమానం చాలా సేపు నేల మీద దూసుకుపోయింది.

ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో చిరంజీవి, బాలకృష్ణ ఎయిర్ హోస్టెస్‌లకు సహాయం చేశారు. ఆ విధంగా ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మన తారలు. ఆ రోజు పైలెట్ భల్లా రిస్క్ తీసుకుని ఉండకపోతే.. ఊహించడానికే కష్టంగా ఉంది.. తమ ప్రాణాలు కాపాడిన భల్లాను దేవుడిగా కీర్తిస్తూ కెప్టెన్ భల్లాను సినీ ప్రముఖులంతా ఘనంగా సత్కరించారు.

Tags

Read MoreRead Less
Next Story